ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాపులారిటీ, స్టార్ డమ్ రోజురోజుకీ అందనంత ఎత్తుకి పెరుగుతోంది. 'పుష్ప' ఫ్రాంచైజీ తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun)కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. ఒక్క 'పుష్ప' మూవీతోనే నేషనల్ అవార్డుతో పాటు ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన బన్నీ మరోసారి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఏకంగా హాలీవుడ్ ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై ఆయన ఫోటోను ముద్రించడం ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. 

హాలీవుడ్ మ్యాగజైన్ పై అల్లు అర్జున్ ఫోటో హాలీవుడ్ ప్రముఖ మ్యాగజైన్ 'ది హాలీవుడ్ రిపోర్టర్' ఇప్పుడు 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' అనే పేరుతో ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. దీని ఫస్ట్ కాపీ కవర్ పేజీ అల్లు అర్జున్ ఫోటోతో రిలీజ్ అవ్వడం విశేషం. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫోటోషూట్ కూడా కంప్లీట్ కాగా, సోషల్ మీడియాలో ఓ బీటీఎస్ ప్రోమో వీడియోను వదిలారు. అందులో అల్లు అర్జున్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. "బలం, ఆత్మ విశ్వాసం నన్ను నటుడిగా ఈ స్థాయిలో నిలబెట్టాయి. అయితే నేను ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం, సామాన్యుడిలాగా వినయంగా ఉండడం అనే విషయాలను నేర్చుకున్నాను. ఇక సినిమాల వల్ల ఎన్నో విషయాలను నేర్చుకుంటున్నాను" అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. అంతే కాదు ఒక్క హిందీ డైలాగ్ కూడా చెప్పకుండానే నార్త్ ఆడియన్స్ మనసును దోచుకున్న అల్లు అర్జున్, ఇంత పెద్ద స్టార్ అయినప్పటికీ తనకు తాను 5.5 రేటింగ్ మాత్రమే ఇచ్చుకున్నాడు. మరి అల్లు అర్జున్ ఇలా చేయడానికి గల కారణం ఏంటో తెలియాలంటే 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' ఫస్ట్ కాపీని చదవాల్సిందే.

ఇక 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' కవర్ పేజీపై అల్లు అర్జున్ ఫోటో ప్రింట్ అయ్యిందన్న విషయం తెలిసిన బన్నీ అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. అంతేకాకుండా తమ అభిమాన నటుడు ఉన్న మ్యాగజైన్ ఫోటో, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు. 

Also Read: సమ్మేళనం రివ్యూ: విలన్ లేని ట్రయాంగిల్ లవ్ స్టోరీ... ETV Winలో కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ... బన్నీ 'పుష్ప 2' మూవీ తో బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఈ మూవీ ఏకంగా రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. ఈ అరుదైన ఘనతను ఇప్పటిదాకా 'బాహుబలి 2' మాత్రమే సాధించింది. అయితే 'పుష్ప 2' మూవీ అల్లు అర్జున్ కు ఎంత స్టార్డమ్ తెచ్చి పెట్టిందో, అంతకంటే ఎక్కువగానే వివాదాల్లోకి నెట్టింది. సంధ్య థియేటర్ ఘటన కారణంగా బన్నీ ఏకంగా జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే ఈ వివాదాలు అన్నింటి నుంచి కోలుకుంటున్న ఆయన తన నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీకి సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత అట్లీతో కూడా ఆయన మరో మూవీని చేయబోతున్నారు.

Read Also : జపాన్‌లో రజనీకాంత్ 'జైలర్' రిలీజ్‌కు అంతా రెడీ... క్రేజ్ మామూలుగా లేదు, ఎప్పుడో తెలుసా?