Jailer Release In Japan: జపాన్‌లో రజనీకాంత్ 'జైలర్' రిలీజ్‌కు అంతా రెడీ... క్రేజ్ మామూలుగా లేదు, ఎప్పుడో తెలుసా?
Jailer Release Date In Japan: సూపర్ స్టార్ రజనీకాంత్‌కు జపాన్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు అక్కడ రిలీజ్ అవుతాయి. లేటెస్ట్ సూపర్ హిట్ 'జైలర్' జపాన్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఎప్పుడో తెలుసా?

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అంటే భారతీయులకు మాత్రమే కాదు... జపనీయులకు కూడా చాలా అభిమానం. జపాన్ (Japan)లో ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అది కూడా ఇప్పుడిప్పుడు మొదలైన ఫాలోయింగ్ కాదు. ఎప్పుడో 1998 నుంచి ఉంది. రజనీ ప్రతి సినిమా అక్కడ విడుదల అవుతుంది. రీసెంట్ రజనీ బ్లాక్ బస్టర్ 'జైలర్' కూడా జపాన్ దేశంలో విడుదలకు రెడీ అయింది.
శుక్రవారం జైలర్ జపనీస్ రిలీజ్!
Jailer Japan Release date: అవును... ఈ శుక్రవారం రజనీకాంత్ 'జైలర్' సినిమా జపనీస్ భాషలో విడుదల కానుంది. ఆ విషయాన్ని రజనీకాంత్ అఫీషియల్ జపనీస్ ఫ్యాన్ పేజ్ పేర్కొంది. ఆ దేశంలోని వివిధ థియేటర్లలో సినిమా విడుదల అవుతుందని తెలిపింది. జపాన్‌లో 'ముత్తు' సినిమా భారీ విజయం సాధించింది. అప్పటి నుంచి ఆయన సినిమాలు ఆ దేశంలో విడుదల అవుతూ వస్తున్నాయి.
Also Read: మహా కుంభమేళాకు 'ఓదెల 2'... తమన్నా సినిమా టీజర్‌కు ముహూర్తం ఖరారు
రజనీ సత్తా ఏమిటో చెప్పిన సినిమా!
తమిళ, తెలుగు భాషలలో ఆగస్టు 10, 2023న 'జైలర్' విడుదల అయింది. భారీ ఓపెనింగ్ ఏమీ లభించలేదు. విమర్శకుల నుంచి కూడా పూర్తి స్థాయిలో ప్రశంసలు రాలేదు. రజనీకాంత్ ఇమేజ్, ఆయన స్టార్ స్టేటస్ వాడుకుని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ డీసెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ తీశారని విమర్శకులతో పాటు ప్రేక్షకులు కూడా పేర్కొన్నారు. అయితే... బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది.
సుమారు 200 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిన 'జైలర్' సినిమా బాక్సాఫీస్ బరిలో 650 కోట్లకు పైగా వసూలు చేసింది. రజనీకాంత్ సత్తా ఏమిటి అనేది మరోసారి బలంగా చాటి చెప్పింది. కేవలం రజనీకాంత్ ఇమేజ్ మీద ఆడిన సినిమా 'జైలర్' అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. మరి జపనీస్ రిలీజ్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది? జపనీయుల నుంచి ఈ సినిమాకు ఏ విధమైన స్పందన వస్తుంది? అనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.
Also Read: రాజమౌళికి లైన్ వేసిన యాంకర్ రష్మీ... ఐ లవ్యూ కూడా చెప్పేసింది - వైరల్ వీడియో చూడండి
'జైలర్' భారీ విజయం సాధించడంతో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ సీక్వెల్ ప్లాన్ చేశారు. కొన్ని రోజుల క్రితం 'జైలర్ 2' టీజర్ కూడా విడుదల చేశారు. 'జైలర్' విజయంలో కీలక పాత్ర పోషించిన సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ ఆ సీక్వెల్ సినిమాకు కూడా మ్యూజిక్ చేయనున్నారు. 'జైలర్ 2' కంటే ముందు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 'కూలీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శృతి హాసన్, ఆమిర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర నటిస్తున్నారు. బుట్ట బొమ్మ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేస్తోంది.