తమన్నా భాటియా (Tamannaah Bhatia)కు తెలుగులో మిల్కీ బ్యూటీ అనే ఇమేజ్ ఉంది. కమర్షియల్ సినిమాలలో స్టార్ హీరోల సరసన ఆవిడ గ్లామరస్ రోల్స్ చేసిన రోజులు ఉన్నాయి. అయితే ఇప్పుడు తమన్నా రూటు కాస్త మార్చి... ఒకవైపు గ్లామర్ రోల్స్ చేస్తూ, మరొక వైపు కంటెంట్ బేస్డ్ ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నారు. అందులో 'ఓదెల 2' (Odela 2 Movie) ఒకటి. ఆ సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు అయింది.
మహా కుంభమేళాలో 'ఓదెల 2' టీజర్ విడుదల
Odela 2 Teaser Launch At Mahakumbh Mela 2025: తమన్నా భాటియా ప్రధాన పాత్రలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'ఓదెల 2'. ఈ నెల (ఫిబ్రవరి) 22వ తేదీన... అంటే శనివారం టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అనౌన్స్ చేసింది. రెగ్యులర్ సినిమాలకు టీజర్ లాంచ్ ప్రోగ్రామ్ చేసినట్లు కాకుండా... సినిమా థీమ్ రిప్రెజెంట్ చేసేలా టీజర్ లాంచ్ ప్లాన్ చేశారు. అది కూడా కాశీలో! ఎందుకంటే... 'ఓదెల 2'లో తమన్నా నాగ సాధువు పాత్ర చేస్తున్నారు. ఈ హీరోయిన్ లుక్ ఆల్రెడీ విడుదల చేశారు. దానికి ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది.
ఫిబ్రవరి 22న వారణాసిలో మహా కుంభమేళాలో 'ఓదెల 2' టీజర్ విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్ర బృందం. మహా కుంభమేళాలో ఇప్పటి వరకు సినిమా టీజర్ ఏది విడుదల చేసింది లేదు. ఆ రికార్డు క్రియేట్ చేస్తున్న మొదటి సినిమా తమన్నాది కావడం విశేషం.
'ఓదెల రైల్వే స్టేషన్'కు సీక్వెల్ ఈ 'ఓదెల 2'
సంపత్ నంది అందించిన కథతో 2021లో వచ్చిన 'ఓదెల రైల్వే స్టేషన్' సినిమాకు సీక్వెల్ ఇది. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన అశోక్ తేజ ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీం వర్క్స్ సంస్థలపై డి మధు ప్రొడ్యూస్ చేస్తున్నారు. 'ఓదెల రైల్వే స్టేషన్'లో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ భార్యాభర్తలుగా నటించారు. ఇప్పుడు సీక్వెల్‌లో కూడా వాళ్ళిద్దరూ ఉన్నారు. ఆ కథకు, నాగ సాధువుకు సంబంధం ఏమిటి అనేది సినిమాలో చూడాలి.
Also Read: హరీష్ శంకర్‌కు ధైర్యం వచ్చింది... ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చారు!
Odela 2 movie cast and crew: 'ఓదెల 2' యాక్షన్ సీక్వెన్సుల కోసం తమన్నా ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. భారీ నిర్మాణ వ్యయం, ఉన్నత నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ చిత్రానికి 'కాంతార', 'మంగళవారం', 'విరూపాక్ష' సినిమాల ఫేం అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సౌందర్ రాజన్ ఎస్, కళా దర్శకత్వం: రాజీవ్ నాయర్.
Also Read: రాజమౌళికి లైన్ వేసిన యాంకర్ రష్మీ... ఐ లవ్యూ కూడా చెప్పేసింది - వైరల్ వీడియో చూడండి