ఇండియాలో రిచెస్ట్ హీరోయిన్స్... టాప్ 10 లిస్ట్ అంతా షారుఖ్‌తో సినిమాలు చేసినోళ్లే, ఫస్ట్ ముగ్గురూ వెరీ స్పెషల్

Richest Actress In India: ఇండియాలో అత్యధిక సంపన్నురాలైన హీరోయిన్ ఎవరో తెలుసా? బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ జుహీ చావ్లా. మరి, ఆ తర్వాత స్థానాల్లో ఎవరెవరు ఉన్నారో తెలుసా?

Continues below advertisement

భారతదేశంలోనే అత్యంత ధనవంతురాలైన నటిగా బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ జుహీ చావ్లా గుర్తింపు పొందారు. హురున్ రిచ్ లిస్ట్ 2024 ప్రకారం... జుహీ సంపద స్టార్ హీరో షారుక్ ఖాన్ తో సమానంగా ఉంది. తన స్నేహితుడు, బిజినెస్ పార్టనర్ షారుక్ ఖాన్ కంటే కేవలం కొంచెం మాత్రమే ఆస్తిలో వెనకబడి ఉంది జుహీ చావ్లా. ఆమె ఆస్తుల విలువ ఏకంగా 4600 కోట్లు ఉండడం విశేషం. ఇంతటి భారీ సంపదలతో చిత్ర పరిశ్రమలోని తన సహ నటీనటులను వెనకకు నెట్టింది ఈ బ్యూటీ. భారతదేశంలోని అత్యంత ధనవంతులైన నటీమణుల జాబితాలో జుహీ చావ్లా నెంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకుంది. మరి రెండు, మూడో స్థానాల్లో ఉన్న హీరోయిన్లు ఎవరో తెలుసా? 

Continues below advertisement

రెండవ స్థానంలో ఉన్న రిచెస్ట్ హీరోయిన్ 

రెడ్ చిల్లీస్ గ్రూప్‌లో సహ వ్యవస్థాపకురాలిగా, సహ నిర్మాతగా, ఐపీఎల్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సహా అనేక క్రికెట్ జట్లకు సహ యజమానిగా ఉన్నారు జుహీ. ఆమె తన వ్యాపారవేత్త భర్త జే మెహతాతో కలిసి భారీ పెట్టుబడులు కూడా పెట్టారు.

జుహీ చావ్లా తర్వాత వందల కోట్ల ఆస్తుల విలువతో ఇండియాలోనే రిచ్ హీరోయిన్ గా రెండవ స్థానాన్ని సొంతం చేసుకున్న హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్. ఈ ప్రపంచ సుందరి ఆస్తుల విలువ దాదాపు 860 కోట్లు ఉంటుంది. పెళ్లై, పిల్లలు పుట్టే దాకా కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా కొనసాగిన ఈ బ్యూటీ బ్రాండ్ అనౌన్స్మెంట్లు, సినిమాల ద్వారా భారీగానే ఆస్తులను కూడబెట్టింది. పెళ్లయ్యాక కూడా ఈ అమ్మడు పలు పాన్ ఇండియా సినిమాలలో భాగమవుతున్న సంగతి తెలిసిందే. సౌత్ లో చివరిసారిగా ఐశ్వర్యరాయ్ 'పొన్నియన్ సెల్వన్' సినిమాలో నటించింది. 

Also Read: ప్రేక్షకుడి టైంలో 25 నిమిషాలు వేస్ట్ చేస్తారా... థియేటర్లలో సినిమా ముందు యాడ్స్ వేసినందుకు కేసు, పీవీఆర్‌కు లక్ష ఫైన్

అత్యధిక సంపన్న హీరోయిన్ల జాబితాలో మూడవ స్థానంలో ఉన్న అందాల భామ గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. దేశీ గర్ల్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం హాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే 650 కోట్ల ఆస్తులతో ఇండియాలోనే అత్యంత కాస్ట్లీ హీరోయిన్ గా మూడో స్థానంలో ఉంది ప్రియాంక. ఈ అమ్మడు బ్రాండ్ ఎండార్స్మెంట్లు,  చిత్రనిర్మాణ సంస్థ, హాలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్టుల నుంచి రెండు చేతులా సంపాదిస్తోంది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా జక్కన్న చేపట్టిన పాన్ వరల్డ్ మూవీ 'ఎస్ఎస్ఎంబి 29'లో భాగమైన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఇప్పుడు షూటింగ్ దశలో ఉంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ కోసం ప్రియాంక చోప్రా దాదాపు 30 కోట్లు పారితోషికంగా తీసుకుందని టాక్. అలాగే వీళ్ళతో పాటు కరీనా కపూర్, అలియా భట్, దీపికా పదుకొనే వంటి హీరోయిన్లు ఇండియాలో అత్యంత భారీగా ఆస్తులు ఉన్న హీరోయిన్ల జాబితాలో చోటు సంపాదించుకున్నారు.

ఆస్తులు ఉన్న టాప్ 10 హీరోయిన్లు 
1. జూహి చావ్లా- రూ. 4600 కోట్లు
2. ఐశ్వర్య రాయ్- రూ. 860 కోట్లు
3. ప్రియాంక చోప్రా- రూ. 650 కోట్లు
4. అలియా భట్- రూ. 550 కోట్లు
5. దీపికా పదుకొనే- రూ. 500 కోట్లు
6. కరీనా కపూర్- రూ. 485 కోట్లు
7. అనుష్క శర్మ- రూ. 255 కోట్లు
8. మాధురి దీక్షిత్- రూ. 250 కోట్లు
9. కాజోల్- రూ. 240 కోట్లు
10. కత్రినా కైఫ్- రూ. 225 కోట్లు

Also Read: రకుల్ పెళ్లిలో ఫోనుల్లేవ్... ఆ కండిషన్ ఎందుకో చెప్పిన స్టార్ హీరోయిన్

Continues below advertisement