Allu Arjun Buy Brand News Car: అల్లు అరవింద్‌ గుర్తించి ప్రత్యేకంగా పరియం అవసరం లేదు. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు. ఇండస్ట్రీలో ఎంత పోటీ ఉన్న నిర్మాతగా వరుస విజయాలు అందుకుంటున్నారు. నిర్మాతగా ఇండస్ట్రీలో అల్లు అరవింద్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తన సొంత బ్యానర్‌ గీతా ఆర్ట్స్‌ ద్వారా ఎన్సో హిట్స్‌, బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చిత్రాలను అందించారు. ఇటీవల బన్నీ వాసు నిర్మాతగా గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌ను కూడా ఏర్పాటు చేశారు. గీతా ఆర్ట్స్‌ ద్వారా స్టార్‌ హీరోలు చిత్రాలు నిర్మిస్తున్న ఆయన గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్లో కొత్త నటీనటులను ప్రొత్సహిస్తున్నారు.


ఈ బ్యానర్లో చిన్న సినిమాలు, కొత్త నటీనటుల చిత్రాలు, డబ్బింగ్స్‌ సినిమాలు రిలీజ్‌ చేస్తూ సక్సెస్‌ అందుకుంటున్నారు. మొత్తానికి నిర్మాతగా వరుస సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటున్న ఆయన తాజాగా బ్రాండ్ న్యూ లగ్జరీ కారు కొన్నారు. ఇప్పటికే పలు కాస్ట్రీ కార్లు అరవింద్‌ గ్యారేజ్‌లో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా బీఎండబ్ల్యూను కూడా తన కార్ల గ్యారేజ్‌లో చేర్చారు. అయితే ఈసారి లగ్జరీ సౌకర్యాలతో కూడిన అత్యాధునిక ఫిచర్‌ కలిగిన బ్రండ్‌ న్యూ కారును ఆయన కొనుగొలు చేసినట్టు తెలుస్తోంది. బీఎండబ్య్లూ ఐ7 ఈవీ (BMW i7 EV ) ఎలక్ట్రిక్‌ కారు కొనుగోలు చేశారు. ఇటీవల దీనికి BMW షో రూం వారు స్వయంగా అల్లు అరవింద్‌ ఇంటికి వెళ్లి కారు హ్యాండోవర్ చేశారు. షో రూం నుంచి ఆయన ఇంటికి తీసుకెళ్లడం వరకు కారు వీడియోను సదరు సంస్థ సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. అంతేకాదు ఈ కారు లోపల వీడియోను కూడా చూపించారు. ఈ కారులో మొత్తం లగ్జరీ సౌకర్యాలతో స్టైలిష్‌గా ఉంది. ఇక ఈ కారు ఫీచర్స్‌ తెలిస్తే అవాక్కావ్వాల్సిందే.






బీఎండబ్య్లూ ఐ7 ఈవీ ఫీచర్స్‌ విషయానికి వస్తే


ఇందులో ట్విన్‌ ఎలక్ట్రిక్‌ మోటారు సెటప్‌ ఉందట. అలాగే 101.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్​ కెపాసిటి​. ఇది ఒక్కసారి ఫుల్‌ చార్జ్‌ చేస్తే సుమారు రూ. 625కి.మీ దూరం ప్రయాణించవచ్చట. ఎలక్ట్రిక్​ పార్కింగ్​ బ్రేక్​, ఆటో హోల్డ్​ వంటి సేఫ్టీ ఫీచర్సతో పాటు అటెన్​టివ్​నెస్​ అసిస్టెన్స్​, డైనమిక్​ స్టెబులిటీ కంట్రోల్​, కార్నరింగ్​ బ్రేక్​ కంట్రోల్​ వంటి అత్యాధునిక టెక్నికల్‌ కంట్రోల్‌ ఫీచర్స్‌ ఈ కారు ప్రత్యేకత. ఇందులో మరో అద్భుతమైన ఫీచర్‌ ఎంటంటే  8k డిస్‌ప్లే. అమెజాన్​ ఫైర్​ టీవీ ఇందులో ఇన్​-బిల్ట్‌గా ఇచ్చారు. ఈ ఈవీలో అలాయ్​ వీల్స్​ చాలా కొత్తగా డిజైన్​ చేశారు. మొత్తంగా ఈ కారు అత్యద్బుతమైన ఫీచర్స్‌, లేటెస్ట్‌ డిజైన్స్‌తో లగ్జరీగా, స్పెషల్‌గా ఉంది. ఇక ఈ కారు ధర స్టార్టింగ్‌ ప్రైజ్‌ వచ్చే రూ. 1.60 కోట్ల నుంచి ఉన్నట్టు సమాచారం. ఇక అల్లు అర్జున్‌ కొన్న ఈ BMW i7 EV కారు ధర వచ్చి రూ. 2.50 కోట్లపైనే ఉందట.



ఈ కారును సొంతం చేసుకున్న టాలీవుడ్ తొలి సెలబ్రిటీ


దీంతో అంతా ఈ కారు ధర తెలిసి అంతా అవాక్క్‌ అవుతున్నారు. ఇంతటి కాస్ట్లీ కారు కొన్న అల్లు అరవింద్‌కు నెటజన్లు కంగ్రాట్స్‌ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కారు వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతుంది.  ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఎవరికి లేదట. బాలీవుడ్‌లో అజయ్‌ దేవగన్‌ వంటి స్టార్స్‌, ప్రముఖులు మాత్రం ఈ కారును సొంతం చేసుకున్నారు. ఇక సౌత్‌లో దళపతి విజయ్‌ ఇటీవల ఈ కారును కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ లగ్జరీ బీఎండబ్ల్యూను టాలీవుడ్‌లో సొంతం చేసుకున్న తొలి వ్యక్తి అల్లు అరవిందేనట.


Also Read: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన యాక్షన్‌ మూవీ 'యోధ' - స్ట్రీమింగ్‌ ఎక్కండంటే!