తెలుగు చిత్రసీమలోని ఈ తరం యువ హీరోలలో నవ్వుల రారాజు 'అల్లరి' నరేష్ (Allari Naresh). ఈ కామెడీ కింగ్ కథానాయకుడిగా నటించిన సినిమా 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku Movie). 'నాంది', 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం', 'ఉగ్రం' వంటి సీరియస్ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న అల్లరోడు... మళ్లీ తనకు అత్యధిక విజయాలు అందించిన కామెడీ జానర్ ఫిల్మ్ చేశారు. అదే 'ఆ ఒక్కటీ అడక్కు'. సెన్సార్ కంప్లీట్ అయ్యింది. మరి, ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు? సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉంది? అనేది చూడండి. 


కామెడీతో ఫుల్ మీల్స్ పెట్టిన అల్లరి నరేశ్!
Aa Okkati Adakku 2024 Movie Censor Report: 'ఆ ఒక్కటి అడక్కు' సినిమాకు సెన్సార్ బోర్డు 'యు/ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది. అల్లరోడు ఈజ్ బ్యాక్ అన్నట్టు మూవీ ఉందని సెన్సార్ సభ్యులు ప్రశంసించినట్లు తెలిసింది. ముఖ్యంగా నరేశ్ కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్ ఈ మూవీకి హైలైట్ అవుతాయని అంటున్నారు. పెళ్లి నేపథ్యంలో వచ్చే ప్రతి సీన్ నవ్విస్తుందట. 


తక్కువ రన్ టైమ్ ఉండటం సినిమాకు పెద్ద ప్లస్!
'ఆ ఒక్కటీ అడక్కు' సినిమాకు రన్ టైమ్ పెద్ద ప్లస్ పాయింట్ కానుందని సెన్సార్ సభ్యులతో పాటు సినిమా చూసినవాళ్లు చెప్పే మాట. ప్రజెంట్ జనరేషన్ ఆడియన్స్ లెంగ్తీ మూవీస్ కంటే క్రిస్పీ అండ్ షార్ట్ రన్ టైమ్ ఉన్న మూవీస్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మూడు గంటల మూవీస్ హిట్స్ అవుతున్నా... కామెడీ, కంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్ క్రిస్పీగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా 'ఆ ఒక్కటీ అడక్కు' ఉందని ఫిల్మ్ నగర్ ఇన్ సైడ్ వర్గాల టాక్.


Also Read: కల్కి నిర్మాతలతో శ్రీకాంత్ తనయుడు రోషన్ సినిమా - లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?



మే 3న థియేటర్లలోకి 'ఆ ఒక్కటీ అడక్కు'
రాజేంద్రప్రసాద్ హీరోగా నరేశ్ తండ్రి, దివంగత దర్శకుడు ఈవీవీ తెరకెక్కిన మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు'. అది క్లాసిక్ హిట్. ఆ పేరుతో ఈవీవీ తనయుడు నరేశ్ చేసిన లేటెస్ట్ సినిమా పాత సినిమాకు ఏమాత్రం తీసిపోని వినోదం అందిస్తుందట. మే 3న థియేటర్లలో నయా 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమా విడుదల అవుతోంది. 


'అల్లరి' నరేష్ జోడీగా 'జాతి రత్నాలు' ఫరియా!
హీరోగా 'అల్లరి' నరేశ్ 61వ సినిమా 'ఆ ఒక్కటీ అడక్కు'. ఆయనకు జోడీగా 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) నటించింది. టీజర్, ట్రైలర్లలో ఇద్దరి జోడీ బావుందని పేరు వచ్చింది. హైట్ కూడా మ్యాచ్ అయ్యింది. ఈ జోడీ తెరపై ఎన్ని నవ్వులు పంచిందో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాలి.   


మల్లి అంకం దర్శకుడిగా పరిచయం అవుతున్న 'ఆ ఒక్కటీ అడక్కు'ను చిలకా ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక ప్రొడ్యూస్ చేశారు. లెజెండరీ కమెడియన్ జానీ లివర్ కుమార్తె జెమీ లివర్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది. 'వెన్నెల' కిశోర్, 'వైవా' హర్ష, అరియనా గ్లోరీ ప్రధాన పాత్రలు పోషించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆసియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్ఎల్పీ ద్వారా ఈ సినిమా రిలీజవుతోంది.


Also Readఎన్టీఆర్ కోసం భారీ ప్లాన్ వేసిన ప్రశాంత్ నీల్ - ఇయర్ ఎండ్ నుంచి అసలు కథ షురూ!