కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జవాన్’. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. 19 రోజుల్లోనే 1000 కోట్ల మైలురాయి క్లబ్ లో చేరి సంచలనం సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1120 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి, 2023 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఐదో వారంలోనూ మంచి వసూళ్లను రాబడుతున్న ఈ సినిమా.. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది.
‘జవాన్’ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. అయితే థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ యాక్షన్ మూవీని, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ గా డిజిటల్ స్ట్రీమింగ్ చెయ్యాలని భావిస్తున్నారట. ఇందులో భాగంగా నవంబర్ 2వ తేదీ నుంచి ఓటీటీలో అందుబాటులో ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 7వ తేదీన హిందీ, తమిళం, తెలుగు భాషల్లో భారీ ఎత్తున విడుదలైంది. థియేట్రికల్ రిలీజైన ఎనిమిది వారాలకు ఓటీటీలో ప్రీమియర్ గా రాబోతున్నట్లు తెలుస్తోంది.
నేటి సమాజంలోని తప్పులను ఎత్తిచూపుతూ, వాటిని సరిద్దిదడానికి ప్రయత్నించే ఓ వ్యక్తి ఎమోషనల్ జర్నీగా 'జవాన్' చిత్రాన్ని తెరకెక్కించారు. సామాజిక, రాజకీయ అంశాలను హైలైట్ చేస్తూ పక్కా కమర్షియల్ సినిమాగా హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా తీర్చిదిద్దారు దర్శకుడు అట్లీ. ఇందులో షారుఖ్ డ్యూయల్ రోల్ ప్లే చేసారు. తండ్రీ కొడుకులు విక్రమ్ రాథోడ్, ఆజాద్ పాత్రల్లో అదరగొట్టారు. స్టైలిష్ యాక్షన్ తో అభిమానాలను విశేషంగా అలరించారు.
Also Read: 2023 Dussehra Movies: దసరా సినిమాల సెన్సార్, రన్‌టైమ్ అప్డేట్స్ ఇవే!
షారుక్ కు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించింది. ఇది ఆమెకు హిందీ డెబ్యూ మూవీ. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటించగా.. దీపికా పదుకొణె, సంజయ్ దత్ ప్రత్యేక అతిధి పాత్రల్లో కనిపించారు. వీరితో పాటుగా ప్రియమణి, సన్యా మల్హోత్రా, గిరిజా ఓక్, సంజీతా భట్టాచార్య, లెహర్ ఖాన్, ఆలియా ఖురేషి, రిధి డోగ్రా, సునీల్ గ్రోవర్, ముఖేష్ ఛబ్రా, యోగి బాబు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ అనిరుధ్ రవి చందర్ సంగీతం సమకూర్చారు.
'జవాన్' చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై షారూక్ ఖాన్ సరీమణి గౌరీ ఖాన్ 300 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారు. గౌరవ్ వర్మ సహ నిర్మాతగా వ్యవహరించారు. తొలి ఆట నుంచే వసూళ్ల వేట ప్రారంభించిన ఈ చిత్రం.. హయ్యెస్ట్ గ్రాస్ రాబట్టిన హిందీ చిత్రంగా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. 'పఠాన్' కలెక్షన్స్ ను క్రాస్ చేసి ఈ ఏడాదిలో మెగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హిందీ వెర్షన్ రూ. 566 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించగా.. తెలుగు తమిళ భాషలు కలుపుకొని రూ. 60 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. నేషనల్ సినిమా డే స్పెషల్ గా అక్టోబర్ 13న రూ. 99 టికెట్ ధరగా నిర్ణయించినందున, ఈ వీకెండ్ లో మరికొన్ని నంబర్స్ గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read: ఈ ఏడాదిలో ఇదే పెద్ద సినిమా.. బడ్జెట్లో కాదండోయ్ రన్టైమ్లో.. మాసోడు అంతసేపు సీట్లో కూర్చోబెడతాడా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial