‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్డేట్: ఈసారి పవర్ స్టార్ ఊచకోత మామూలుగా ఉండదు!

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా షూటింగుకు సంబంధించి మేకర్స్ ఓ క్రేజీ అప్డేట్ అందించారు.

Continues below advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవర్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. 'గబ్బర్ సింగ్' లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఇప్పటి వరకూ రిలీజ్ చేయబడిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ కి మంచి వచ్చింది. పవన్ బర్త్ డే సందర్భంగా వదిలిన స్పెషల్ పోస్టర్ కూడా విశేషంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా షూటింగ్ అప్డేట్ ఇచ్చారు.

Continues below advertisement

ముందుగా చెప్పినట్లుగానే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ షూటింగ్ రేపు (సెప్టెంబర్ 5) మంగళవారం స్టార్ట్ అవుతుందని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. "మాసివ్ యాక్షన్ షెడ్యూల్ కోసం అంతా సిద్ధంగా ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ రేపు పునఃప్రారంభం కానుంది" అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఓ ఫోటోని అభిమానులతో పంచుకున్నారు. దీనికి దర్శకుడు హరీష్ శంకర్ స్పందిస్తూ.. 'మనల్ని ఎవడ్రా ఆపేది' అని ట్వీట్ చేశారు.

ఫోటో విషయానికొస్తే, హరీశ్ శంకర్ కొన్ని ఆయుధాలను ముందు పెట్టుకొని నిలబడి ఉన్నారు. ఇందులో పెద్ద గంట, పొడవాటి కత్తులు, పదునైన గొడ్డళ్లు, పెద్ద సుత్తి వంటి రకరకాల మారణాయుధాలను మనం గమనించవచ్చు. దీన్ని బట్టి ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. స్టంట్ డైరెక్టర్ ద్వయం రామ్-లక్ష్మణ్ ఈ సీక్వెన్స్ ని ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు సమాచారం. ఇక ఈ ఫైట్ ద్వారా ఉస్తాద్ పవన్ కల్యాణ్ ఊచకోత ఎలా ఉంటుందో చూపిస్తారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: 'హరి హర వీరమల్లు' రిలీజ్ డేట్‌పై నిర్మాత క్లారిటీ!

మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ హరీష్ శంకర్ ఉస్తాద్ సినిమాలో పవన్ కళ్యాణ్ ని మునుపెన్నడూ లేని మాస్ క్యారెక్టర్ లో చూపిస్తున్నారు. ఇటీవల విడుదలైన బర్త్ డే పోస్టర్ లో పవర్ స్టార్ ఖాకీ చొక్కా, గళ్ళ లుంగీ ధరించి, రక్తంతో తడిచిన కత్తి పట్టుకుని మాస్ స్వాగ్ ను చూపించారు. రేపటి నుంచి గతంలో ఎన్నడూ చూడని విధంగా పవన్ తో ఓ మాసివ్ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయటానికి రెడీ అవుతున్నారు.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. అశుతోష్ రానా, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె. దశరధ్ స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. సి. చంద్రమోహన్ అడిషినల్ రైటర్. అయనంక బోస్ సినిమాటోగ్రాఫర్ గా, ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఆనంద్ సాయి ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Also Read: 'సలార్' డేట్‌పై ఖర్చీప్స్ వేస్తున్న క్రేజీ సినిమాలు!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement