ప్రముఖ ఇజ్రాయెల్ నటి గాల్ గాడట్ ప్రధాన తారగా రూపొందుతున్న హాలీవుడ్ సినిమా 'హార్ట్ ఆఫ్ స్టోన్'. ఇందులో భారతీయ నటి ఆలియా భట్ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అయితే... అంతకు ముందు పోర్చుగల్‌లోని ఎడారిలో షూటింగ్ చేసినప్పుడు కొంత మంది ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో ఆలియా భట్ బేబీ బంప్ క్లియర్ కట్‌గా కనబడుతోందని నెటిజన్లు అంటున్నారు. 


ర‌ణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ వివాహం ఏప్రిల్ 14న జరిగింది. జూన్ 27న తాను గర్భవతి అని ఆలియా తెలిపారు. అలాగని, షూటింగులకు బ్రేక్ ఇవ్వలేదు. ఆ క‌మిట్‌మెంట్‌, ప్రొఫెషనలిజం అభిమానులకు నచ్చింది. పోర్చుగల్‌లో షూటింగ్ పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆలియా భట్ మీద ప్రశంసల వర్షం కురిపించారు. ఆ ఫోటోల్లో ఆలియా ప్రెగ్నెన్సీ కూడా కనిపించింది. షూటింగ్ చేసినప్పుడు బేబీ బంప్ కవర్ అయ్యేలా బ్లాక్ జాకెట్ ఒకటి ఆలియా ధరించడం గమనార్హం. 


Also Read : నాగార్జున ఊచకోత మామూలుగా లేదుగా - దసరాకు థియేటర్లలోకి 'ఘోస్ట్'గా వస్తున్న కింగ్


షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా గాల్ గాడట్, 'హార్ట్ ఆఫ్ స్టోన్' బృందానికి ఆలియా భట్ థాంక్స్ చెప్పారు. వచ్చే ఏడాది నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ఈ సినిమా విడుదల కానుంది.    


Also Read : 'కెజియఫ్'లో బానిసల్లా, కుక్కల్లా చూస్తే ఎవరుంటారు? 'హైపర్' ఆది కూడా మానేస్తున్నాడు - 'జబర్దస్త్'పై 'కిరాక్' ఆర్పీ సెన్సేషనల్ కామెంట్స్