కింగ్ అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటించిన సినిమా 'ది ఘోస్ట్'. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఇందులో నాగార్జునది మాజీ 'రా' ఏజెంట్ రోల్. సిస్టర్ సెంటిమెంట్‌తో కూడిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా గూస్ బంప్స్ వచ్చే యాక్షన్ సీన్స్‌తో తెరకెక్కించారు.


'ది ఘోస్ట్' సినిమా ఓటీటీలో విడుదల కానుందని వార్తలు వచ్చాయి. అయితే, ఆ ప్రచారంలో నిజం లేదని, థియేటర్లలో సినిమాను విడుదల చేస్తామని రెండు రోజుల క్రితమే చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్టు ఈ రోజు వెల్లడించారు. అక్టోబర్ 5 అంటే విజయ దశమి. ఈ సినిమాతో నాగార్జున దసరా సీజన్ టార్గెట్ చేశారన్నమాట. అలాగే, ఈ రోజు సినిమా గ్లింప్స్‌ విడుదల చేశారు (Nagarjuna Targest Dussehra 2022 with The Ghost Movie).


గ్లింప్స్‌లో నాగార్జునను చూపించినది 35 సెకన్లు మాత్రమే. అయితే... కాసేపటిలో ఆయన విధ్వంసం సృష్టించారు. విలన్లను ఊచకోత కోశారు. గ్లింప్స్‌లో ఇలా ఉంటే థియేటర్లలో ఏ విధంగా ఉంటుందో ఊహించుకోండి.    


Also Read : రజనీ ఆత్మీయత, న‌య‌న్‌కు షారుఖ్ కౌగిలింత - ఫోటోలు షేర్ చేసిన భర్త



సోనాల్ చౌహన్ కథానాయికగా నటిస్తున్న 'ది ఘోస్ట్' సినిమాను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Also Read : ముగింపు మన చేతుల్లో ఉండదు - 'సీతా రామం'లో సుమంత్ లుక్ చూశారా? మాట విన్నారా?