అలేఖ్య... ఇప్పుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాలలో పాపులర్. ఒక్కటా రెండా... లక్షల సంఖ్యలో ఆవిడ మీద సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. వేల సంఖ్యలో ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి. అలేఖ్యతో పాటు ఆవిడ అక్కచెల్లెళ్ళు సుమ, రమ్య మోక్ష సారీ చెప్పడంతో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లేనని అందరూ భావించారు. అయితే అవి ఫుడ్స్ ఓనర్ చేసిన వీడియో కొత్త చర్చకు దారి తీసింది.
బిజినెస్ స్టార్ట్ చేయకముందు కూడా బ్లాక్ మెయిల్!
అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అలేఖ్యకు చాలా తల పొగరు పెరిగిందని సోషల్ మీడియాలో విమర్శించిన జనాల సంఖ్య తక్కువేం కాదు. అయితే ఆవిడ గురించి తమకు ఎప్పుడో తెలుసని అవి ఫుడ్స్ ఓనర్ అంటున్నారు.
అలేఖ్య చిట్టి పికిల్స్ స్టార్ట్ చేయక ముందు సోషల్ మీడియాలో సుమ కంచర్ల, అలేఖ్య చిట్టి కంచర్ల, రమ్య మోక్ష కంచర్ల సిస్టర్స్ చాలా పాపులర్. వాళ్లకు ఉన్న ఫాలోయింగ్ చూసి తమ పికిల్స్ ప్రమోట్ చేయమని అప్రోచ్ అయ్యామని... సుమ కంచర్ల ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రమోట్ చేశారని, తమ ప్రోడక్ట్ గురించి వీడియో చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారని అవి ఫుడ్స్ ఓనర్ తెలిపాడు. అలేఖ్య మాత్రం తమను చాలా ఇబ్బంది పెట్టిందన్నారు.
తమ పికిల్స్ ప్రమోట్ చేయడం కోసం అలేఖ్య మూడు వేలు అడిగితే అంత ఇవ్వలేమని చెప్పడంతో చివరకు రెండు వేల రూపాయలకు ఓకే చేసిందని, అయితే ప్రమోషనల్ వీడియోలో పది అంకెల ఫోన్ నెంబర్ బదులు 11 నెంబర్లు ఇచ్చిందని అవి ఫుడ్స్ ఓనర్ ఒక వీడియో చేశాడు. అలేఖ్యకు ప్రమోషనల్ వీడియోలో ఎడిట్స్ ఉన్నాయని చెప్పడంతో పాటు మార్పులు చేయమని అడగడంతో మరొక వెయ్యి రూపాయలు డిమాండ్ చేయడంతో తాము అంత ఇవ్వలేనని అన్నామని, తమకు ఎటువంటి ప్రమోషన్ అవసరం లేదని, వెయ్యి రూపాయలు ఇవ్వలేమని చెబితే నెగటివ్ పబ్లిసిటీ చేస్తానని బ్లాక్ మెయిల్ చేసినట్లు అవి ఫుడ్స్ ఓనర్ చెప్పాడు. తాను చెప్పింది నిజమేనని నిరూపించడానికి అలేఖ్యతో చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్స్ కూడా వీడియోలో చూపించారు.
అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ తర్వాత జనాలు అందరికీ వాళ్ల గురించి తెలిసిందని, తనకు మాత్రం ఎప్పుడో తెలుసని అవి ఫుడ్స్ ఓనర్ ఇప్పుడు వీడియో చేయడంతో వైరల్ అవుతోంది. ఏడాది క్రితం అలేఖ్యతో జరిగిన చాటింగ్ ఇప్పుడు బయట పెట్టడానికి కారణం కేవలం ప్రస్తుతం వాళ్లలో ఉన్న నెగెటివిటీ కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుండు మీద కారం చల్లినట్లు అలేఖ్య ముందు నుంచి ఇంతేనని అవి ఫుడ్స్ ఓనర్ వీడియో చేయడం వల్ల ఆవిడ ఇమేజ్ మరింత డామేజ్ అవుతోంది.