Latest News About Alekhya Chitti Pickles Controversy: అలేఖ్య చిట్టి పికిల్స్ ఇష్యూ గురించి సపరేట్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. మూడు నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే ట్రోల్స్, మీమ్స్, క్లారిఫికేషన్ వీడియోస్ - ఒక్కటేమిటి? ఎటు చూసినా వీళ్ళ గురించి డిస్కషన్. ఈ వివాదానికి కారణమైన అలేఖ్య చిట్టి షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఆవిడ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేశారు.
ఇన్‌స్టాలో అలేఖ్య చిట్టి పేజీ లేదు
అలేఖ్య చిట్టి పికిల్స్ సోషల్ మీడియాలో పాపులర్. ఆ వ్యాపారానికి అంత క్రేజ్ రావడానికి కారణం ముగ్గురు అక్క చెల్లెళ్లు. తనకు పెళ్లయిందని, చెల్లి కోసం ప్రమోషనల్ వీడియోస్ చేశాను తప్ప తనకు ఆ వ్యాపారానికి సంబంధం లేదని సుమ కంచర్ల తెలిపారు. అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ ఐడియా తనదేనని, కానీ ఆ బూతులు తిట్టింది తన అక్క అలేఖ్య అని, కస్టమర్లు తిట్టడం వల్ల అక్క కూడా అలా తిట్టాల్సి వచ్చిందని రమ్య మోక్ష కంచర్ల పేర్కొన్నారు.
వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగినప్పుడు అక్క చెల్లెళ్లు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వ్యతిరేకత వచ్చేసరికి తన ఫోటోలు, తన భర్త ఫోటోలు ఎందుకు వాడుతున్నారని సుమ నెటిజనులను ప్రశ్నించారు. అలేఖ్య చెల్లెలు ఏమో తాను తిట్టలేదని క్లారిటీ ఇచ్చారు. వాళ్లిద్దరూ వీడియోలు విడుదల చేసిన తర్వాత ఈ వివాదానికి మూల కారణమైన అలేఖ్య మీద మరింత ట్రోలింగ్ పెరిగింది. ఆవిడను టార్గెట్ చేసే జనాలు పెరిగారు. బహుశా... ఆ ట్రోలింగ్ తట్టుకోలేక ఆవిడ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేశారు.
అవును... అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ చేసే అలేఖ్య కంచర్ల తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేశారు. 'అలేఖ్య చిట్టి' పేరుతో నిన్న మొన్నటి వరకు ఆమెకు పర్సనల్ ఐడీ ఉండేది. అలేఖ్య చిట్టి పికిల్స్ కోసం క్రియేట్ చేసిన ఐడీకి ప్రజెంట్ 82 వేల మంది ఫాలోయర్లు ఉన్నారు. అది కాకుండా 'అలేఖ్య చిట్టి'కి 68 వేల మంది ఫాలోయర్లు ఉండేవారు. ఇప్పుడు ఆ పేజీని డిలీట్ చేశారు.
అలేఖ్య సిస్టర్స్ మతం మీద పోస్టులు
అలేఖ్య సిస్టర్స్ మతం ఏమిటి? అని కొందరు కొత్త చర్చ మొదలు పెట్టారు. వాళ్ళు క్రిస్టియన్స్ అని, తండ్రిని ఖననం చేశారని, క్రిస్టియన్ అయ్యుండి సేల్స్ (అలేఖ్య చిట్టి పికిల్స్) కోసం వేషాలు వేశారని, ఉగాది పచ్చడి తిన్నట్టు వీడియో చేశారని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. అయితే... ఎవరు ఏ మతం అయితే ఏమిటని, ఆ విధంగా పోస్ట్ చేయడం తప్పని కొందరు హితవు పలికారు.