Latest Upcoming Telugu Movies Release In April 2025 2nd Week: ఏప్రిల్ రెండో వారంలో పలువురు పెద్ద హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. గత వారం చిన్న చిత్రాలే విడుదల కాగా.. ఈసారి మాత్రం కోలీవుడ్, బాలీవుడ్ హీరోల చిత్రాలు తెలుగులోనూ రిలీజ్ కానుండడంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ నెలకొంది. ఈ వారం విడుదలయ్యే సినిమాలు ఓసారి చూస్తే..
అజిత్ - త్రిష 'గుడ్ బ్యాడ్ అగ్లీ'
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, స్టార్ హీరోయిన్ త్రిష మరోసారి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly). ఇటీవలే 'విదాముయర్చి' (తెలుగులో పట్టుదల) మూవీలో వీరిద్దరూ సందడి చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. మరోసారి 'గుడ్ బ్యాడ్ అగ్లీ'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఈ మూవీని అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించగా.. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీలో అజిత్ డిఫరెంట్ లుక్ ఆకట్టుకుంటోంది. యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్‌లో మూవీ రూపొందగా.. ఆపదలో ఉన్న తన కుమారుణ్ని రక్షించుకునేందుకు రిటైర్డ్ గ్యాంగ్ స్టర్ ఏం చేశాడనేదే స్టోరీ అని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.
టాలీవుడ్ దర్శకునితో సన్నీ డియోల్
బాలీవుడ్ హీరో సన్నీ డియోల్‌తో టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ 'జాట్' (Jaat). ఓ తీర ప్రాంతంలో గ్రామాన్ని శాసించే విలన్‌కు బుద్ధి చెప్పిన హీరో అక్కడి ప్రజలకు ఎలా అండగా నిలిచాడన్నదే కథ. ఈ సినిమాలో సయామీ ఖేర్, రెజీనా హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సిద్ధు 'జాక్'
టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వస్తోన్న లేటెస్ట్ మూవీ 'జాక్' (Jack). కామెడీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. సిద్ధు సరసన వైష్ణవీ చైతన్య హీరోయిన్‌గా నటించారు. ఓ రహస్య ఆపరేషన్ కోసం రంగంలోకి దిగిన జాక్ ఏం చేశాడు?, మరి ఆ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందా?, అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ నెల 10న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.
యాంకర్ ప్రదీప్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'
ప్రముఖ యాంకర్ ప్రదీప్ హీరోగా వస్తోన్న రెండో మూవీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' (Akkada Ammayi Ikkada Abbayi). ఓ గ్రామంలో ప్రాజెక్టు పని కోసం వెళ్లిన యువకుడికి ఏం జరిగింది. ఆ ఊర్లో ఒకే ఒక్క అమ్మాయి ఉంటే పరిస్థితి ఏంటి?, అనేదే ప్రధానాంశంగా రూపొందిన కామెడీ ఎంటర్‌టైనర్ ఈ సినిమా. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ దీపిక పిల్లి హీరోయిన్‌గా చేశారు. నితిన్ - భరత్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 11న విడుదల కానుంది.
కౌసల్య తనయ రాఘవ
రాముడు, రావణుడు కాన్సెప్ట్‌తో రాజేశ్ కొంచాడా, శ్రావణి శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'కౌసల్య తనయ రాఘవ' (Kousalya Tanaya Raghava). స్వామి పట్నాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మమ్ముట్టి 'బజూక'
మలయాళ స్టార్ మమ్ముట్టి హీరోగా డీనో డెన్నిస్ తెరకెక్కించిన మలయాళ సినిమా 'బజూక' (Bazooka). ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈ నెల 10న థియేటర్లలోకి రానుంది.
అలాగే, గిప్పీ గ్రేవాల్, గురుప్రీత్ ప్రధాన పాత్రల్లో రూపొందిన 'అకాల్' మూవీ ఈ నెల 10న పంజాబీ, హిందీలో రిలీజ్ కానుంది. మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ఆధారంగా తెరకెక్కిన హిందీ చిత్రం 'పూలే'. ఈ నెల 11న రిలీజ్ కానుంది.
ఓటీటీల్లోకి వచ్చే మూవీస్
- ఈటీవీ విన్ - లైఫ్ పార్ట్‌నర్, ఉత్తరం, టుక్ టుక్ (ఏప్రిల్ 10)
- నెట్ ఫ్లిక్స్ - పెరుసు (ఏప్రిల్ 11 తెలుగు), కిల్ టోనీ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - ఏప్రిల్ 7), బ్లాక్ మిర్రర్ 7 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - ఏప్రిల్ 10), ఫ్రోజెన్ హాట్ బాయ్స్ (ఏప్రిల్ 10)
- సోనీలివ్ - ప్రావింకూడు షాపు (ఏప్రిల్ 11 తెలుగు)
- అమెజాన్ ప్రైమ్ - ఛోరీ 2 (హిందీ ఏప్రిల్ 11)
- జియో హాట్ స్టార్ - ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ 6 (హిందీ యానిమేషన్ సిరీస్ - ఏప్రిల్ 11)