Akshay Kumar Look From Kannappa : కన్నప్ప సినిమా నుంచి శివుడి లుక్​ని రిలీజ్ చేసింది చిత్రబృందం. మంచు విష్ణు హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి ఒక్కొక్కరి లుక్​ని రిలీజ్ చేస్తూ మూవీ మీద హైప్ పెంచుతున్నారు. రీసెంట్​గా కాజల్ అగర్వాల్ పార్వతీ లుక్​ని రిలీజ్ చేసి బజ్ క్రియేట్ చేసిన మూవీ టీమ్.. తాజాగా పరమేశ్వరుడి రూపంలో ఉన్న అక్షయ్ కుమార్ లుక్​ని విడుదల చేసింది. 

అక్షయ్ కుమార్ లుక్​ని ఆరు భాషల్లో విడుదల చేస్తూ.. సోషల్ మీడియాలో కన్నప్ప టీమ్ ఫోటోలు షేర్ చేసింది. ముల్లోకాలను ఏలే పరమేశ్వరుడు భక్తికి మాత్రం దాసుడు అనే క్యాప్షన్​తో శివుడి లుక్​ని రిలీజ్ చేశారు. ॐ The Eternal Protector ॐ Unveiling @akshaykumar as *𝐋𝐨𝐫𝐝 𝐒𝐡𝐢𝐯𝐚'🔱, a captivating presence of divinity, power, and serenity in #Kannappa🏹.✨ Dive into the ageless story of unwavering love, devotion, and sacrifice. Experience the grandeur on the big screen this April 2025! 🎥✨ #LordShivaॐ #HarHarMahadevॐ Om Namah Shivaya ॐ అనే క్యాప్షన్​తో విడుదల తేదితో ఉన్న ఫోటోలను చిత్రబృందం షేర్ చేశారు.

ఈ విషయాన్ని తెలుపుతూ.. అక్షయ్ కూడా లుక్ షేర్ చేసి.. Stepping into the sacred aura of Mahadev for #Kannappa🏹. Honored to bring this epic tale to life. May Lord Shiva guide us on this divine journey. Om Namah Shivaya! #LordShivaॐ #HarHarMahadevॐ అంటూ క్యాప్షన్ ఇచ్చి.. సినిమాపై బజ్ పెంచారు. 

 

శివుడి లుక్​లో అక్షయ్ కుమార్.. 

శివుడి లుక్​లో కనిపించడం అక్షయ్ కుమార్​కి కొత్తేమి కాదు. ఓ మై గాడ్ 2లో అక్షయ్ శివుడి రూపంలో కనిపించాడు. అయితే ఇప్పటి కన్నప్ప లుక్​ ప్రేక్షకుల కొత్తగాని.. బాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తకాదు. కానీ తాజాగా విడుదల చేసిన పరమేశ్వరుడి లుక్​లో అక్షయ్ స్టన్నింగ్​గా కనిపించారు. రెండు సినిమాల కథ వేరు కాబట్టి.. ఈ లుక్​ దానికి చాలా డిఫరెంట్​గా ఉంది. శివ తాండవం చేస్తున్నట్లు ఉన్న పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచుతుంది. 

ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహాత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్పూర్తిగా తీసుకుని కన్నప్పగా చేస్తూ.. ఈ సినిమాను మంచు విష్ణు తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా ఫిల్మ్​గా వస్తున్న ఈ సినిమాలో స్టార్ కాస్ట్ ఉన్నారు. మంచు మోహన్​బాబు నిర్మిస్తోన్న ఈ సినిమాను ముకేష్ కుమార్ డైరక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 25, 2025వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 

మంచు విష్ణు కన్నప్ప పాత్రలో నటిస్తుండగా.. అక్షయ్ కుమార్ శివుడిగా, పార్వతీ దేవిగా కాజల్ అగర్వాల్ చేస్తున్నారు. నంది పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. ఈ సినిమాకు ఇదే అతి పెద్ద ప్లస్​ కానుంది. మోహన్ లాల్, మోహన్ బాబు, ముఖేష్ రుషి, బ్రహ్మాజీ, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, మధుబాల కీలకపాత్రలు పోషిస్తున్నారు. విష్ణు పిల్లలు కూడా ఈ సినిమాతో టాలీవుడ్​కి ఎంట్రీ ఇవ్వనున్నారు. 

Also Read : మూడేళ్లలో 32 కిలోలు తగ్గిన సీనియర్ హీరోయిన్.. కుష్బూ వెయిట్ లాస్ జర్నీ ఇదే