అక్కినేని ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దివంగత లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు కూతురు, సీనియర్ హీరో నాగార్జున సోదరి నాగ సరోజ మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె, మంగళవారం నాడు తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది.


అక్కినేని నాగేశ్వరరావు - అన్నపూర్ణమ్మ దంపతులకు నాగ సత్యవతి, నాగ సుశీల, నాగ సరోజ, వెంకట్‌, నాగార్జున.. ఇలా ఐదుగురు సంతానం ఉన్నారనే సంగతి తెలిసిందే. వారిలో సుమంత్, సుప్రియల తల్లి సత్యవతి చాలా సంవత్సరాల క్రితమే మరణించారు. ఇప్పుడు నాగ సరోజ మృతి చెందారనే వార్త కాస్త ఆల్యంగా వెలుగులోకి వచ్చింది.


అక్కినేని ఫ్యామిలీకి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానం ఉంది. మూడు తరాల వారు సినీ ఇండస్ట్రీకి సేవలు అందిస్తున్నారు. నాగేశ్వరరావు నట వారసత్వాన్ని ఆయన చిన్న కొడుకు నాగార్జున కొనసాగిస్తున్నారు. మనవళ్లు సుమంత్, నాగచైతన్య, అఖిల్, సుశాంత్ లు ఆ లెగసీని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.


ఇక వెంకట్, నాగ సుశీలలు నిర్మాతగా సినిమాలు చేయగా, సుప్రియ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలు చూసుకుంటోంది. ఇలా కుటుంబ సభ్యుల్లో చాలా వరకూ సినీ ఇండస్ట్రీలో ఉన్నారు కానీ, నాగ సరోజ మాత్రం మొదటి నుంచి పరిశ్రమకు దూరంగానే ఉన్నారు. ఆమె అక్కినేని హీరోల సినిమాల ఫంక్షన్స్ లో, ఇతర వేడుకల్లో ఎప్పుడూ కనిపించలేదు. 


అంత పెద్ద సినీ ఫ్యామిలీకి చెందినప్పటికీ నాగ సరోజ చాలా సింపుల్‌ గా, చివరి వరకూ సాదారణ జీవితాన్ని గడపడానికే ఇష్టపడేదట. అందుకే ఆమెకు సంబంధించిన వివరాలు ఎవరికీ పెద్దగా తెలియలేదు. ఇప్పుడు ఆమె మరణించిన వార్త కూడా ఆలస్యంగానే బయటకు వచ్చింది.


ఇటీవల కాలంలో సినీ ప్రముఖుల కుటుంబాలలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిర్మాత దిల్ రాజు తండ్రి, సీనియర్ నటుడు నాజర్ తండ్రి మరణించారు. అలానే హీరో విజయ్ ఆంటోనీ కుమార్తె బలవన్మరణానికి పాల్పడింది. ఇప్పుడు నాగ సరోజ మరణంతో అక్కినేని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


Also Read: అల్లువారి ఇంట వరుణ్‌ తేజ్ - లావణ్య ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial