నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నచిత్రం ‘భగవంత్ కేసరి’. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరికొద్ది గంటల్లో ఈ సినిమా థియేటర్లలోకి అడుగు పెట్టనున్న నేపథ్యంలో షూటింగ్ సమయంలో తీసిన ఫన్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
షూటింగ్ స్పాట్ లో నవ్వులే నవ్వులు
బాలయ్య షూటింగ్ స్పాట్ లో చాలా గాంభీర్యంగా ఉంటారని భావిస్తారు. కానీ, ఆయనతో కలిసి పని చేసిన చాలా మంది నటీనటులు బాలయ్య చాలా ఫన్నీగా ఉంటారని చెప్తుంటారు. తాజాగా ‘భగవంత్ కేసరి’ చిత్రబృందం విడుదల చేసిన వీడియో చూస్తుంటే అది నిజమేనని తెలుస్తోంది. నటీనటులతోనే కాదు, చిత్రబృందంతోనూ ఆయన చాలా సరదాగా గడుపుతూ కనిపించారు. దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్ కాజల్ అగర్వాల్, మరో హీరోయిన్ శ్రీలీలతో కలిసి బాలయ్య చేసే ఫన్ అందరనీ నవ్వుల్లో ముంచెత్తుతోంది. బాలయ్య వారితో కలిసి చిన్న పిల్లాడిలా చేసే సరదా సరదా కామెడీ ఆకట్టుకుంటోంది. అందరూ కలిసి ‘భగవంత్ కేసరి’ సినిమా షూటింగ్ లో బాగా ఎంజాయ్ చేశారు అనిపిస్తోంది.
‘భగవంత్ కేసరి’కి క్లీన్ యు/ఎ సర్టిఫికేట్
ఇక ‘భగవంత్ కేసరి’ సినిమా హాస్యంతో కూడిన యాక్షన్ మూవీ అని దర్శకుడు ఈ వీడియోతో చెప్పే ప్రయత్నం చేసినట్లు అర్థం అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమాకు ఎలాంటి కట్స్ లేకుండానే క్లీన్ యు/ఎ సర్టిఫికేట్ ను జారీ చేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ ను164 నిమిషాలు(2 గంటల 44 నిమిషాలు)గా ఫిక్స్ అయ్యింది.
అమెరికాలో ‘భగవంత్ కేసరి’ గ్రాండ్ ప్రీమియర్స్
ఇక ఇవాళ(అక్టోబర్18న) అమెరికాలో ‘భగవంత్ కేసరి’ గ్రాండ్ ప్రీమియర్స్ వేయనున్నారు. ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో పాపులర్ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ హౌజ్ సరిగమ సినిమాస్ విడుదల చేస్తోంది. ఇప్పటికే చక్కటి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుపుకుంది ఈ చిత్రం. ఇక ‘భగవంత్ కేసరి’ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇప్పటికే భగవంత్ కేసరి నుంచి విడుదల అయిన గణేష్ ఆంథెమ్, ఉయ్యాలో ఉయ్యాలా పాటలు ప్రేక్షకులను బాగా అలరించాయి. కనీవినీ ఎరుగని వ్యూస్ తో దూసుకెళ్తున్నాయి. మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Read Also: 'సర్వం శక్తిమయం' ట్రైలర్ రిలీజ్ చేసిన రవితేజ - అష్టాదశ శక్తిపీఠాల అద్భుత కథ ఇది!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial