Akira Nandan at Mega Sankranthi Celebrations: ప్రతీ పండగకు ప్రేక్షకులను, ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేయడం మెగా ఫ్యామిలీకి అలవాటే. ఏ పండగ అయినా కూడా మెగా ఫ్యామిలీ అంతా కలిసి సంబురాలు చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఒకవేళ అందరూ కలిస్తే.. దానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ కూడా చేస్తుంది ఈ ఫ్యామిలీ. తాజాగా సంక్రాంతిని మెగా కుటుంబం అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంది. మూడు తరాల కుటుంబమంతా ఒక ఇంట్లో చేరి సంక్రాంతిని ఘనంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను వారందరూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ సెలబ్రేషన్స్‌లో అకీరా నందర్ కీబోర్డ్ పర్ఫార్మెన్స్ హైలెట్‌గా నిలిచింది.


పవన్ లేకపోయినా వారసులు వచ్చారు..
మామూలుగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ ఏమైనా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు అవ్వరు. ఇది ఇప్పటికే చాలా సందర్భాల్లో జరిగింది. పైగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్స్ హడావిడి సాగుతుండడంతో పవన్ మరీ బిజీ అయిపోయారు. అందుకే సంక్రాంతికి మెగా కుటుంబం అంతా ఒక్క దగ్గరికి చేరినా.. పవన్ కళ్యాణ్ మాత్రం ఈ సెలబ్రేషన్స్‌ను మిస్ అయ్యారు. కానీ తన వారసులు మాత్రం ఈ వేడుకను మిస్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతో అకీరా నందన్‌ను, ఆద్యాను అక్కడకి పంపింది రేణూ దేశాయ్. వారిద్దరు అక్కడ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది కూడా. ఇక సందర్భం వచ్చినప్పుడల్లా తనలోని కీబోర్డ్ టాలెంట్‌ను బయటపెట్టే అకీరా నందన్.. ఈ సంక్రాంతి వేడుకల్లో కూడా ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు.






సంక్రాంతి సంబరాల్లో అకీరా పాట


పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్.. చాలా ఏళ్ల నుండి కీబోర్డ్‌ను నేర్చుకుంటున్నాడు. ఏ పాటను అయినా కీబోర్డ్‌తో ప్లే చేసి చాలాసార్లు వినేవారిని మెస్మరైజ్ చేశాడు కూడా. ఈ విషయాన్ని తన తల్లి రేణూ దేశాయ్ పలుమార్లు బయటపెట్టింది. అకీరా పర్ఫార్మెన్స్‌లను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అలా అకీరా కీబోర్డ్ ప్లే చేస్తున్న ఎన్నో వీడియోలు వైరల్ అయ్యాయి కూడా. ఇక మెగా ఫ్యామిలీ అంతా కలిసి చేసుకున్న సంక్రాంతి సంబరాల్లో కూడా అకీరా తన కీబోర్డ్ టాలెంట్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ వీడియోను మెగా కోడలు ఉపాసన.. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇక అందులో అకీరా ప్లే చేస్తున్న పాటపై చర్చ మొదలయ్యింది.


‘పాపా మేరీ జాన్’..


ఉపాసన షేర్ చేసిన అకీరా కీబోర్డ్ వీడియోలో తను ఏ పాట ప్లే చేస్తున్నాడు అనేది స్పష్టంగా వినిపించలేదు. అందుకే ‘యానిమల్’ సినిమాలోని ‘పాపా మేరీ జాన్’ పాట ఆడియోను బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టి.. ఈ వీడియోను షేర్ చేశారు ఉపాసన. అదే పాటను వీడియోకు యాడ్ చేసిందంటే కచ్చితంగా అకీరా.. అదే పాట ప్లే చేసి ఉంటాడు అని పవన్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. తన తండ్రిని ఉద్దేశించి.. మెగా ఫ్యామిలీ ముందు ఈ పాటను ప్లే చేసి ఉంటాడని అనేసుకుంటున్నారు. అకీరా నందన్‌కు సినిమాల్లోకి రావాలని ఆసక్తి ఉందా, లేదా అని పట్టించుకోకుండా పవర్ స్టార్ వారసుడు అంటూ ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయిపోయారు.



Watch Video: మెగా సంక్రాంతి సంబరాల్లో అకీరా నందన్ సంగీత ప్రతిభ, ఆ పాటే ఎంచుకోవడానికి కారణమేంటి..?