‘ఏజెంట్’ సినిమా ఇచ్చిన షాక్ తో అఖిల్ (Akhil Akkineni)తో పాటూ ఆయన ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. ఆచితూచి కథలు ఎంపిక చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన తన తదుపరి ప్రాజెక్ట్ కోసం బ్రేక్ తీసుకున్నారు. ఫైనల్ గా ఓ సినిమా ఓకే చేశారు. కిరణ్ అబ్బవరంతో 'వినరో భాగ్యము విష్ణు కథ' తీసిన దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు కథ నచ్చడంతో ఆయన సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున, సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫోర్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.


రాయలసీమ నేపథ్యంలోని ప్రేమకథతో
‘మిస్టర్ మజ్నూ’ అనే రొమాంటిక్ లవర్ బోయ్ గా కనిపించారు అఖిల్. ఆ తర్వాత ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో ఓ పద్ధతైన కుర్రాడిలా కనిపించి మెప్పించారు. హిట్ అయింది. స్పై  థ్రిల్లర్ ‘ఏజెంట్’ సినిమా చేసి ప్రేక్షకుల్ని డిజప్పాయింట్ చేశారు అఖిల్. అయితే తన నెక్ట్స్ సినిమాగా ఓ ప్రేమ కథను ఎంచుకున్నారు అఖిల్. రాయలసీమ నేపథ్యంలో సాగుతుందట ఈ సినిమా. ఇప్పటికే యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో అనిల్ కుమార్ అనే కొత్త డైరెక్టర్  చెప్పిన కథకు ఓకే చెప్పారు అఖిల్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న ఈ కథ 80 ల పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుంది.


Also Readబిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు నుంచి బయటకొచ్చాక మావయ్య దగ్గరకు మొదటిసారి... పుష్ప 2 టీ షర్ట్ లేకుండా!



శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ సినిమాలు
Sreeleela Upcoming Movies Telugu: ఈ సినిమాలో అఖిల్ సరసన హీరోయిన్ గా శ్రీలీల ఎంపికయ్యారు. ఇప్పటికే నాగచైతన్య నటించననున్న కొత్త సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు శ్రీలీల. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకుడు. రవితేజ ‘మాస్ జాతర’, సిద్ధూ జొన్నలగడ్డ సినిమాల్లోనూ ఆమెనే హీరోయిన్ గా ఎంచుకున్నారు దర్శకనిర్మాతలు. త్వరలోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు శ్రీలీల. ఇక శ్రీలీల కెరీర్ విషయానికొస్తేచ గత ఏడాది ఆమె నటించిన నాలుగు సినిమాల్లో ‘భగవంత్ కేసరి‘ మాత్రమే హిట్ అయింది. కానీ అందులో ఆమె హీరోయిన్ కాదు. హీరో బాలకృష్ణ కూతురిగా నటించారు. ఆ ఏడాది ఆమె హీరోయిన్ గా కనిపించిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం’ ఓకే అనిపించుకుంది. ‘పుష్ప 2’ లోని కిస్సిక్ పాటతో మరో సారి లైమ్ లైట్ లోకి వచ్చేశారు శ్రీలీల. ఆమె నితిన్ తో నటించిన ‘రాబిన్ హుడ్’ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. తాజాగా అఖిల్ సరసన ఓ  సినిమా ప్రారంభమైంది. ఇందులో హీరోయిన్ గా శ్రీలీల ఎంపికయ్యారు.


Also Read'బిగ్ బాస్' విజేతలుగా నిలిచిన ఆ ఏడుగురు... వాళ్ళ సరసన చేరేది ఎవరు? Bigg Boss 8 Telugu Winner అతనేనా?