Akhanda 2: హిమాలయాలకు అఖండ 2... బాలకృష్ణతో అఘోర గెటప్ సీన్స్ షూటింగ్ షూటింగ్

Akhanda 2 latest update: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ,‌‌ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న తాజా సినిమా 'అఖండ 2'. త్వరలో ఈ టీం హిమాలయాలకు వెళ్ళనుంది.

Continues below advertisement

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) త్వరలో హిమాలయాలకు వెళ్ళనున్నారు. బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తో ఆయన చేస్తున్న తాజా సినిమా 'అఖండ 2' (Akhanda 2 Movie). ఈ సినిమా కోసమే అంత హిమాలయాలు వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే...

Continues below advertisement

హిమాలయాల్లో అఘోర సీన్స్ చిత్రీకరణ!
'అఖండ 2' సినిమాలో అఘోర పాత్రలో బాలకృష్ణ కనిపించిన సంగతి తెలిసిందే. ఆ క్యారెక్టర్ సీక్వెల్‌లో కూడా కంటిన్యూ అవుతుంది. ఆ సీన్స్ చిత్రీకరణ కోసం 'అఖండ 2' చిత్ర బృందం హిమాలయాలకు వెళ్లేందుకు రెడీ అవుతోంది.

హిమాలయాలలో రెక్కీ చేసేందుకు బోయపాటి శ్రీను తన బృందాన్ని పంపించారు.‌ 'అఖండ 2' విషయంలో ఆయన అసలు రాజు పడడం లేదు. ఇటీవల మహా కుంభమేళాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు హిమాలయాలు వెళుతున్నారు.‌ సినిమా ప్రోగ్రెస్ అయ్యే కొలది ప్రేక్షకులలో అంచనాలో మరిన్ని పెరుగుతున్నాయి.

Also Read: ప్రభాస్ - ప్రశాంత్ వర్మ సినిమాలో హీరోయిన్ ఆ అమ్మాయే... ఫస్ట్‌ మూవీ ఫ్లాపైనా ఫుల్ ఆఫర్స్!

బాలకృష్ణ సరసన హీరోయిన్ సంయుక్త!
'అఖండ' సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ రోల్ చేశారు.‌ అయితే సీక్వెల్ వచ్చే సరికి హీరోయిన్ మారింది. ఇందులో సంయుక్త (Akhanda 2 Actress) హీరోయిన్ రోల్ చేస్తున్నారు. క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఏమిటి అనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.

Also Readస్టార్‌ హీరోకి 55 కేసులు... రూ 90 కోట్ల అప్పు... చేతిలో ఒక్క ఆఫర్ లేని టైంలో కాపాడింది ఎవరో తెలుసా?


'అఖండ 2'లో విలన్‌గా ఆది పినిశెట్టి! 
'అఖండ 2'లో సంయుక్త హీరోయిన్ కాగా... ఆది పినిశెట్టి విలన్. బోయపాటి శ్రీనుతో ఈ యంగ్ హీరోకి మంచి అనుబంధం ఉంది. ఇద్దరూ కలిసి ఇంతకు ముందు 'సరైనోడు' చేశారు. ఆ సినిమాలో ఆది పినిశెట్టి విలనిజం చేయించారు బోయపాటి. ఇప్పుడు మరోసారి అతడిని 'అఖండ 2'లోకి తీసుకున్నారు. ఇటీవల 'అఖండ 2' షెడ్యూల్ అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ స్టూడియోలో జరిగింది. అందులో హీరో విలన్ మీద సీన్స్ తీశారు.

దసరా కానుకగా థియేటర్లలోకి 'అఖండ 2'
Akhanda 2 Release Date: 'అఖండ 2 తాండవం' విడుదల తేదీని కొన్ని రోజుల క్రితం అనౌన్స్ చేశారు. ఈ ఏడాది దసరా సందర్భంగా... సెప్టెంబర్ 25వ తేదీన థియేటర్లలోకి సినిమాలు తీసుకు వస్తున్నట్లు తెలిపారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో కూడా సినిమాను రిలీజ్ చేయనున్నారు. బాలకృష్ణ రెండో కుమార్తె ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ పతాకం మీద రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

Continues below advertisement