Tillu Cube: రవితేజ... సిద్ధూ జొన్నలగడ్డ... ఎవరి సినిమా ముందు? - 'మ్యాడ్ స్క్వేర్' రిజల్ట్ డిసైడ్ చేస్తుందా?

Tillu Cube : 'టిల్లు క్యూబ్' డైరెక్టర్ ను నిర్మాత నాగవంశీ అనౌన్స్ చేశారు. 'మ్యాడ్ స్క్వేర్' మూవీ డైరెక్టర్ కు ఆ గోల్డెన్ ఛాన్స్ ఇచ్చినట్టు ప్రకటించారు. ఒకవేళ ఈ మూవీ హిట్టైతే నెక్స్ట్ ఛాన్స్ రవితేజతో.

Continues below advertisement

యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డని స్టార్ బాయ్ గా మార్చిన మూవీ 'టిల్లు'. ఇదే ఫ్రాంచైజీలో వచ్చిన 'టిల్లు స్క్వేర్' మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచి, సిద్ధూని 100 కోట్ల హీరోగా నిలబెట్టింది. ఈ నేపథ్యంలోనే 'టిల్లు క్యూబ్' అనే మూడో పార్ట్ కూడా ఉంటుందని నిర్మాత నాగ వంశీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 'టిల్లు క్యూబ్' సినిమాకి డైరెక్టర్ ఎవరు అన్నీ ఇన్నాళ్లుగా కొనసాగుతున్న సస్పెన్స్ కి తాజాగా నిర్మాత నాగవంశీ తెరదించారు. పైగా 'టిల్లు క్యూబ్' టెస్ట్ గనక పాస్ అయితే ఆ తరువాత రవితేజతో మాస్ జాతర పెట్టే ఛాన్స్ ఆ దర్శకుడికి దక్కుతుంది. 

Continues below advertisement

'టిల్లు క్యూబ్' డైరెక్టర్ గా కళ్యాణ్ శంకర్ 

తాజాగా జరిగిన 'మ్యాడ్ స్క్వేర్' ప్రెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ స్వయంగా 'టిల్లు క్యూబ్' డైరెక్టర్ ను ప్రకటించారు. 'మ్యాడ్ స్క్వేర్' మూవీకి డైరెక్టర్ అయిన కళ్యాణ్ శంకరే నెక్స్ట్ 'టిల్లు క్యూబ్'కు కూడా దర్శకత్వం వహిస్తారని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం కళ్యాణ్ శంకర్ - సిద్దు స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టారని, వచ్చే ఏడాది షూటింగ్ మొదలు కానుందని నాగ వంశీ గుడ్ న్యూస్ చెప్పారు. ఇక ఈ మూవీకి భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారని తెలుస్తోంది. స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత ఈ సినిమా నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులను అనౌన్స్ చేస్తారు. 

అయితే 'టిల్లు' ఫ్రాంచైజీలో వస్తున్న సినిమాలకి ఒక్కో సీక్వెల్ కి ఒక్కో డైరెక్టర్ దర్శకత్వం వహిస్తూ వస్తున్నారు. సిద్ధూ జొన్నలగడ్డ, నేహ శెట్టి హీరో హీరోయిన్లుగా రూపొందిన 'టిల్లు' మూవీకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. మంచి అంచనాలు నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. అలాగే సిద్ధూ, నేహ, విమల్ కి ఈ మూవీ మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. ఈ నేపథ్యంలోనే 'టిల్లు'కి సీక్వెల్ గా 'టిల్లు స్క్వేర్' మూవీని ప్రకటించారు. అయితే సీక్వెల్లో హీరోయిన్ తో పాటు డైరెక్టర్ ను కూడా మార్చేశారు. ఫస్ట్ పార్ట్ కి విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తే, సెకండ్ పార్ట్ కు మాత్రం మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ 100 కోట్ల క్లబ్లో చేరింది. తాజాగా 'టిల్లు క్యూబ్' మూవీకి మరో కొత్త డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించబోతున్నట్టు అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు.

Also Readస్టార్‌ హీరోకి 55 కేసులు... రూ 90 కోట్ల అప్పు... చేతిలో ఒక్క ఆఫర్ లేని టైంలో కాపాడింది ఎవరో తెలుసా?

మాస్ మహారాజాతో కళ్యాణ్ శంకర్

'మ్యాడ్' అనే చిన్న సినిమాతో దర్శకుడిగా మారిన కళ్యాణ్ శంకర్ 'మ్యాడ్ స్క్వేర్' మూవీతో మార్చ్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే 'టిల్లు క్యూబ్'కి దర్శకత్వం వహించే గోల్డెన్ ఛాన్స్ కళ్యాణ్ శంకర్ కి రావడం విశేషం. అయితే మరోవైపు కళ్యాణ్ శంకర్ ఇప్పటికే మాస్ మాహారాజా రవితేజకు స్క్రిప్ట్ విన్పించారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అయితే రవితేజతో డైరెక్టర్ కళ్యాణ్ మూవీ 'టిల్లు క్యూబ్'కి ముందు ఉంటుందా? లేదంటే తరువాత ఉంటుందా? అనేది క్లారిటీ లేదు. కానీ సమాచారం ప్రకారం 'టిల్లు క్యూబ్' టెస్ట్ పాస్ అయితేనే కళ్యాణ్ శంకర్ కు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని తెలుస్తోంది.

Also Readటీఆర్పీలో మళ్ళీ ఫస్ట్ ప్లేసుకు కార్తీక దీపం 2... స్టార్ మా, జీ తెలుగులో ఈ వారం టాప్ 10 రేటింగ్స్ లిస్టు

Continues below advertisement