Aishwarya Lekshmi Quits Social Media 

Continues below advertisement


నా ఆలోచనలు ఆనందాలను దూరంచేసింది


కళాకారిణిగా నన్ను నేను కాపాడుకునేందుకు ఈ నిర్ణయం


సోషల్ మీడియాకు వీడ్కోలు పలుకుతూ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి పెట్టిన పోస్ట్ ఇది


నిన్న అనుష్క..ఈ రోజు ఐశ్వర్య లక్ష్మి.. సోషల్ మీడియాకు బైబై చెప్పేశారు


విభిన్న పాత్రల్లో నటించిన ఐశ్వర్య లక్ష్మి అభిమానులకు షాక్ ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా ప్రపంచానికి గుడ్ బై చెప్పేయాలని డిసైడ్ అయినట్టు చెప్పారు. మానసిక ప్రశాంతతకు, వృత్తికి ఆటంకంగా మారిందంటూ ఓ లేఖను  పోస్ట్ చేశారు. ఆ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ లెటర్లో ఏముదంటే.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే సోషల్ మీడియా తప్పనిసరి అని అనుకున్నా.. కానీ.. అది తన పనికి ఆటంకం కలిగించడమే కాదు..ఆనందాన్ని, ఆలోచనలు దోచుకుందన్నారు. చిన్న చిన్న సంతోషాలను కూడా బాధగా మార్చేసిందని, సోషల్ మీడియాలో సృష్టించే ఊహలకు, అంచనాలకు అనుగుణంగా జీవించడం ఓ మహిళగా చాలా కష్టంగా మారింది. అందుకే సోషల్ మీడియా ప్రపంచానికి బ్రేకప్ చెప్పేశానంటూ లెటర్ రాసుకొచ్చారు.  



హీరోయిన్ గా తనలో అమాయకత్వాన్ని, వాస్తవితకతను కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు ఐశ్వర్య లక్ష్మి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోతే ఈ రోజుల్లో జనానికి గుర్తుండం అని తెలుసు కానీ ఆ సాహసానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకొచ్చారు. నాలో నటిని బతికించుకునేందుకు ఇంటర్నెట్ కు దూరంగా ఉంటున్నా అని వివరించారు. ఈ నిర్ణయం తన జీవితంలో బలమైన బంధాలు ఏర్పరుస్తుందని మరిన్ని మంచి సినిమాలతో మీ ముందుకి వచ్చేందుకు దోహదపడుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. తనను ప్రేమగా గుర్తు పెట్టుకోవాలని అభిమానులను కోరారు.  ‘మామన్’ మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్న ఐశ్వర్య లక్ష్మి, ప్రస్తుతం ‘గట్ట కుస్తీ-2’, ‘సంబరాల ఏటిగట్టు’ మూవీస్ తో బిజీగా ఉన్నారు. వీటిలో సంబరాల ఏటిగట్టు మెగా హీరో సాయి దుర్గా తేజ్ (Sai Durga Tej) 18వ సినిమాగా రూపొందుతోంది. టైటిల్ టీజర్‌ను రామ్ చరణ్  విడుదల చేశారు.


మోడలింగ్ నుంచి నటిగా టర్న్ అయిన ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) మలయాళం, తమిళంలో వరుస సినిమాలు చేశారు.  1991 సెప్టెంబరు 6న కేరళలో జన్మించిన ఆమె ఎర్నాకుళంలోని శ్రీ నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SNIMS) నుంచి 2016లో MBBS డిగ్రీ పూర్తి చేశారు.  2014లో మోడలింగ్‌తో కెరీర్ మొదలుపెట్టి  2017లో మలయాళ చిత్రం Njandukalude Nattil Oridavelaతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ సినిమా ద్వారా ఆమెకు ఫస్ట్ ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది.


రీసెంట్ గా అనుష్క శెట్టి సోషల్ మీడియాకు దూరమవుతున్నట్టు అనౌన్స్ చేశారు..ఇప్పుడు ఆ జాబితాలో ఐశ్వర్య లక్ష్మి కూడా చేరారు. హీరోయిన్స్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారో అనే కొత్త చర్చ జరుగుతోంది. వరుస ఆఫర్స్ తో బిజీగా ఉన్న సమయంలో ఎందుకు సోషల్ మీడియాను వీడుతున్నారో అనే డిస్కషన్ జరుగుతోంది. ఇక ఈ ట్రెండ్ ఇంకొన్నాళ్లు కొనసాగుతుందేమో చూద్దాం.