Balakrishna New Movie With Director Krish Jagarlamudi: గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య ఫ్యాన్స్‌కు ఇది నిజంగా సూపర్ న్యూస్. ఒకే రోజు రెండు భారీ ప్రాజెక్టులకు సంబంధించి బిగ్ అనౌన్స్‌మెంట్స్ రానున్నాయి. స్టార్ డైరెక్టర్ క్రిష్‌ జాగర్లమూడితో కలిసి ఆయన ముచ్చటగా మూడోసారి జత కట్టనున్నారు.

Continues below advertisement

ఆ రోజే అఫీషియల్ అనౌన్స్!

స్టార్ డైరెక్టర్ క్రిష్ చెప్పిన స్క్రిప్ట్‌కు బాలయ్య ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. విజయదశమి సందర్భంగా అక్టోబర్ 2న ఈ ప్రాజెక్టుపై అధికారికంగా ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే క్రిష్‌తో బాలయ్య గౌతమీ పుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్ చేశారు. ఈ రెండు మూవీస్ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్నాయి. ఇప్పుడు అదే జోష్‌తో ముచ్చటగా మూడోసారి క్రిష్‌తో మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ హిస్టారికల్ డ్రామానా లేక మాస్ ఎంటర్‌టైనరా అనేది తెలియాల్సి ఉంది. క్రిష్ రీసెంట్‌గా స్వీటీ అనుష్కతో 'ఘాటి' మూవీ చేయగా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.

Continues below advertisement

Also Read: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల్లో 'ఓజీ' బుకింగ్స్ అప్పుడే!

అదే రోజున...

ఇక అదే రోజున బాలయ్య మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో 'NBK111' ప్రాజెక్టును ఇదివరకే అనౌన్స్ చేసి స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. హై ఓల్జెట్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను బాలయ్య కోసం రెడీ చేశారు గోపీచంద్. ఉగ్రరూపంలో ఉన్న సింహం ఓ వైపు... పవర్ ఫుల్ కవచం మరోవైపు ఉంటూ పోస్టర్ భారీ హైప్ క్రియేట్ చేయగా ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఈ మూవీలో బాలయ్యను చూపించబోతున్నారట. ఇంతకు ముందు వీరిద్దరి కాంబోలో వచ్చిన 'వీరసింహారెడ్డి' మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్షేషన్ క్రియేట్ చేసింది.

ఈ మూవీ కూడా అక్టోబర్ 2నే దసరా సందర్భంగా గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారట. దీన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. 

ఒకేసారి 2 ప్రాజెక్టులు

ప్రస్తుతం బాలయ్య 'అఖండ 2' మూవీతో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వస్తోన్న ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్ ఫస్ట్ వీక్ ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'అఖండ' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించగా... దీనికి సీక్వెల్‌గా 'అఖండ 2' రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, లుక్స్, తమన్ బీజీఎం గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. మంచు కొండల్లో బాలయ్య లుక్ వేరే లెవల్‌లో ఉంది. 

'అఖండ 2' పనులు పూర్తైన తర్వాతే ఈ రెండు ప్రాజెక్టులను ఒకేసారి ట్రాక్ ఎక్కించాలని బాలయ్య భావిస్తున్నారట. అందుకు తగిన విధంగానే షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. రాబోయే రోజుల్లో థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు.