Tollywood Actress Ester Noronha Special Post Viral: 'భీమవరం బుల్లోడు' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు హీరోయిన్ ఎస్తేర్. ఆ తర్వాత తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ మూవీస్‌తో మెప్పించారు. గత కొద్ది రోజుల క్రితం ఆమె రెండో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆమె బర్త్ డే సందర్భంగా ఇన్ స్టాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

ఫోటో విత్ గుడ్ న్యూస్

త్వరలోనే కీలక ప్రకటన చేయబోతున్నట్లు ఓ ఫోటను షేర్ చేశారు ఎస్తేర్. 'లైఫ్‌లో నాకు మరో అందమైన ఏడాదిని దేవుడు ఇచ్చాడు. అవకాశాలతో పాటు ఎన్నో అద్భుతాలను ఇచ్చినందుకు దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు. బర్త్ డే రోజున నాపై మీరంతా ప్రేమతో ఆశీర్వాదాలు కురిపిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మీతో ఓ స్పెషల్ అనౌన్స్‌మెంట్ పంచుకోబోతున్నాను. త్వరలోనే అదేంటో ప్రకటిస్తా. దయచేసి వెయిట్ చేయండి.' అంటూ రాసుకొచ్చారు. దీంతో ఆ ప్రకటన ఆమె రెండో పెళ్లి గురించే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: మిరాయ్ కలెక్షన్లు... మొదటి రోజు కుమ్మేసిన తేజా సజ్జా సినిమా, ఇండియాలో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?

పెళ్లి గురించి ఏమన్నారంటే?

గత కొంతకాలంగా హీరోయిన్ ఎస్తేర్ రెండో పెళ్లి గురించి రూమర్స్ హల్చల్ చేశాయి. దీనిపై ఆమె ఎక్కడా బహిరంగంగా స్పందించలేదు. టాలీవుడ్ సింగర్ నటుడు నోయల్‌ను 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లైన ఆరు నెలల్లోనే ఇద్దరూ విడిపోయారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ప్రస్తావించారు ఎస్తేర్. '2019లో నేను ప్రేమ వివాహం చేసుకున్నా. కేవలం 16 రోజులు మాత్రమే కలిసి ఉన్నాను. ఆ తర్వాత అతనికి దూరంగానే ఉన్నా. 2020లో మా బంధం విడిపోయింది. నాకు ఒంటరిగా బతకాలని లేదు. నాకు అందమైన లైఫ్ కావాలి. నేను మళ్లీ పెళ్లి చేసుకుంటా. అందుకు తగిన పార్ట్‌నర్ కోసం ఎదురుచూస్తున్నా. నన్ను అర్థం చేసుకునే భర్త నాకు కావాలి. షోకేస్ లాంటి భర్త నాకొద్దు. ఫస్ట్ మ్యారేజ్‌లో చాలా సమస్యలు ఎదుర్కొన్నా.' అంటూ చెప్పుకొచ్చారు. 

డివోర్స్ వ్యవహారం తర్వాత కూడా ఎస్తేర్ మూవీస్‌లో నటించారు. కొన్ని మూవీస్‌లో తన గ్లామర్‌తో యూత్ మనసు దోచేశారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, కొంకణి, మరాఠీ, హిందీ భాషల చిత్రాల్లో నటించి మెప్పించారు. జయ జానకీ నాయక, 69 సంస్కార్ కాలనీ, గరం, డెవిల్, టెనెంట్, నయనం, ఐరావతం, చాంగురే బంగారు రాజా మూవీస్‌లో నటించారు. ఈ ఏడాది తల మూవీలో కీలక పాత్ర పోషించారు. పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లోనూ నటించారు. తాజా పోస్ట్‌తో ఎస్తేర్ రెండో పెళ్లి వార్తలు వైరల్‌గా మారాయి.