Mirai First Day Collection In India: సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కావడానికి ముందు రోజు హైదరాబాద్ సిటీలో 'మిరాయ్' పెయిడ్ ప్రీమియర్ షో ఒకటి పడింది. ఆ తర్వాత కొన్ని గంటలకు అటు అమెరికాలోనూ ప్రీమియర్ షోస్ పడ్డాయి. సినిమాకు అన్ని ఏరియాల నుంచి మంచి హిట్ టాక్ లభించింది. మరి, బాక్స్ ఆఫీస్ బరిలో మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా? ముఖ్యంగా ఈ సినిమా ఇండియాలో ఎంత నెట్ కలెక్ట్ చేసిందో తెలుసా?
ఇండియాలో మొదటి రోజు 12 కోట్ల నెట్ కలెక్షన్!Mirai First Day Collection: ఇండియాలో 'మిరాయ్'కు మొదటి రోజు మంచి స్టార్ట్ లభించింది. ఓపెనింగ్ డే 12 కోట్ల రూపాయల నెట్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
తెలుగులో మొదటి రోజు 'మిరాయ్'కు రూ. 10.60 కోట్ల నెట్ కలెక్షన్ రాగా... హిందీలో రూ. 1.25 కోట్లు, తమిళంలో రూ. 5 లక్షలు, మలయాళంలో రూ. 5 లక్షలు, కన్నడలో రూ. 5 లక్షలు వచ్చాయట. దాంతో టోటల్ నెట్ కలెక్షన్ రూ. 12 కోట్లు అయ్యింది.
ఓవర్సీస్ మార్కెట్టులోనూ కుమ్మేసిన 'మిరాయ్' మూవీ!ఇండియాలో మాత్రమే కాదు... ఓవర్సీస్ మార్కెట్టులోనూ 'మిరాయ్' కుమ్మేసింది. అమెరికా నుంచి కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. శుక్రవారంతో పాటు ముందు రోజు పడిన ప్రీమియర్స్ గ్రాస్ కలిపితే 700k డాలర్స్ కలెక్ట్ చేసింది. మన ఇండియన్ కరెన్సీలో సుమారు 6 కోట్లకు పైమాటే.
'మిరాయ్' మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ 25 కోట్లకు పైమాటే!Mirai Box Office Collection Worldwide Day 1: ఇండియాలో మొదటి రోజు 12 కోట్ల నెట్ కలెక్షన్, అమెరికాలో 700k డాలర్స్ కలెక్ట్ చేసింది 'మిరాయ్'. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 27.20 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనౌన్స్ చేసింది. 'హనుమాన్' తర్వాత మరోసారి తేజా సజ్జా సక్సెస్ కొట్టి తానొక ప్రామిసింగ్ స్టార్ మెటీరియల్ అనిపించుకున్నాడని చెప్పవచ్చు.
Also Read: మిరాయ్ చూశారా? ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇకపై ఆ టెన్షన్ లేదు... 'రాజా సాబ్'పై డౌట్స్ అక్కర్లేదు!
'సూర్య వర్సెస్ సూర్య', 'ఈగల్' తర్వాత కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన చిత్రమిది. మొదటి రెండు సినిమాలు ఆయనకు ఆశించిన విజయాలు ఇవ్వలేదు. 'ఈగల్'లో కార్తీక్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్, యాక్షన్ సీక్వెన్సులకు ప్రశంసలు వచ్చాయి. అయితే ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. ఇప్పుడు 'మిరాయ్'తో ఆయన భారీ హిట్ అందుకున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ సైతం కొన్ని వరుస ఫ్లాప్స్ తర్వాత హిట్ అందుకుంది. రితికా నాయక్, శ్రియా శరణ్, జగపతి బాబు, జయరామ్, గెటప్ శ్రీను, కిషోర్ తిరుమల, వెంకటేష్ మహా తదితరులు నటించిన 'మిరాయ్'కు హరి గౌర మ్యూజిక్ అందించారు. ఆయన సంగీతానికి మంచి పేరు వచ్చింది.
Also Read: వైబ్ ఒక్కటే కాదు... 'మిరాయ్'లో నిధి అగర్వాల్ ఐటమ్ సాంగ్ కూడా కట్ - అది బయటకు రాదేమో!