మారుతి దర్శకత్వంలో తమ హీరో నటించడం రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులలో కొందరికి ముందు నుంచి నచ్చడం లేదు. ఇండస్ట్రీలోని ఒక‌ బడా నిర్మాత తమ సినిమా మీద నెగిటివ్ పబ్లిసిటీ చేశారని టీజర్ విడుదల సమయంలో 'ది‌ రాజా సాబ్' క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ కామెంట్ చేశారు. అటువంటి వాళ్ళందరి‌ నోళ్లు మూత పడేలా 'ది రాజా సాబ్' ఉంటుందని అభిమానులకు భరోసా ఇచ్చారు.‌ అయినా సరే ఫ్యాన్స్ అందరిలో ఏదో ఒక మూల చిన్న సందేహం.‌ 'ది‌ రాజా సాబ్' ఎలా ఉంటుందోనని! వీఎఫ్ఎక్స్ విషయంలో సరిగా వస్తుందా? లేదా? అనే టెన్షన్ నెలకొంది.‌ ఇకపై అటువంటి టెన్షన్ వాళ్లకు అవసరం లేదు.

రాజా సాబ్... పక్కా క్వాలిటీ ఫిలిం!'ది రాజా సాబ్' టీజర్ వరకు వీఎఫ్ఎక్స్ పరంగా ఎటువంటి లోపాలు లేవు. రెండు నిమిషాల నిడివి మాత్రమే ఉండే టీజర్, ట్రైలర్ వరకు మిస్టేక్స్ లేకుండా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ చేయించడం వేరు, ఆల్మోస్ట్ రెండున్నర గంటల నిడివి ఉండే సినిమాలో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా విజువల్ ఎఫెక్ట్స్ చేయించడం వేరు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు', మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 'వార్‌ 2',‌ అంతకు‌ ముందు కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు 'సన్నాఫ్ ఇండియా' వంటి సినిమాలు విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో భారీ ట్రోలింగ్ ఎదుర్కొన్నాయి. అందువల్ల 'ది రాజా సాబ్' టీజర్ బావున్నా సరే సినిమా మీద అభిమానుల మదిలో ఎక్కడో సందేహాలు నిలిచాయి. 

Also Read: వైబ్ ఒక్కటే కాదు... 'మిరాయ్'లో నిధి అగర్వాల్ ఐటమ్ సాంగ్ కూడా కట్ - అది బయటకు రాదేమో!

తేజా‌ సజ్జా కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సూపర్ హీరో సినిమా 'మిరాయ్' విడుదల తర్వాత ప్రభాస్ అభిమానులు ఎటువంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.‌ వీఎఫ్ఎక్స్ పరంగా టెన్షన్ పెట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే... 'మిరాయ్' సినిమాకు ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తమ సొంత కంపెనీలో వీఎఫ్ఎక్స్ చేయించింది. ఇప్పుడు ప్రభాస్ సినిమాకు కూడా తమ కంపెనీ చేత విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ చేయించుకుంటుంది. అందువల్ల క్వాలిటీ విషయంలో‌‌ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. అందుకని నో మోర్ వర్రీస్! 

అక్టోబర్ 2న 'ది రాజా సాబ్' ట్రైలర్ విడుదలగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండున 'ది రాజా సాబ్' ట్రైలర్ విడుదల చేస్తున్నారు. ఆ రోజు థియేటర్లలోకి వస్తున్న పాన్ ఇండియా‌ సినిమా 'కాంతార: ఎ లెజెండ్'తో పాటు ట్రైలర్ అటాచ్ చేస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ సాంగ్ విడుదల చేయనున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక ‌ మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లు.‌ సంజయ్ దత్, సప్తగిరి, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read'మిరాయ్' రివ్యూ: క్లైమాక్స్‌లో శ్రీరాముడు వచ్చాడు... తేజా సజ్జా - మంచు మనోజ్ మూవీ హిట్టేనా?