Kishkindhapuri First Day Collection In India: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయితే 'అల్లుడు అదుర్స్' తర్వాత తెలుగులో కొంత గ్యాప్ వచ్చింది ఆయనకు. హిందీలో 'ఛత్రపతి' చేయడం, మధ్యలో కరోనా వంటివి రావడంతో తెలుగు తెరపై నాలుగేళ్లు కనిపించలేదు. మల్టీస్టారర్ 'భైరవం'తో మే 30న థియేటర్లలోకి వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, 'కిష్కింధపురి'తో సెప్టెంబర్ 12న సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?
ఇండియాలో 'కిష్కింధపురి' నెట్ ఎంతంటే?Kishkindhapuri Collection Day 1: 'కిష్కింధపురి'కి మొదటి రోజు ఇండియాలో అంత గొప్ప స్టార్ట్ ఏమీ లభించలేదు. ఈ సినిమా ఫస్ట్ డే ఇండియా నెట్ కలెక్షన్ కేవలం రూ. 2 కోట్లు మాత్రమే.
మరి ఓవర్సీస్ మార్కెట్టులో పరిస్థితి ఎలా ఉంది?ఇండియాలో రెండు కోట్ల రూపాయల నెట్ అంటే ఒక విధంగా మంచి అమౌంట్. వై? ఎందుకు? అంటే... ఒక వైపు సినిమాకు ఎక్కువ థియేటర్లు లభించలేదు. మరో వైపు పాన్ ఇండియా సినిమా 'మిరాయ్' పోటీని తట్టుకుని కలెక్షన్లు రాబట్టింది. అయితే ఈ సినిమాకు ఓవర్సీస్ మార్కెట్టులో అంతగా కలెక్షన్స్ రాలేదు. అక్కడ కేవలం 43 వేల డాలర్లు మాత్రమే వచ్చాయి. హారర్ థ్రిల్లర్స్ చూడటానికి ఎన్నారై ప్రేక్షకులు సుముఖత వ్యక్తం చేయడం లేదని అనుకోవాలి.
Also Read: మిరాయ్ కలెక్షన్లు... మొదటి రోజు కుమ్మేసిన తేజా సజ్జా సినిమా, ఇండియాలో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
సెప్టెంబర్ 12న 'కిష్కింధపురి' థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే దానికి రెండు రోజుల ముందు స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. మీమర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్ నుంచి మంచి టాక్ వచ్చింది. ఆ షోకు వెళ్లిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ డబుల్ కాలర్ ఎగరేశారు. ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 11వ తేదీ రాత్రి స్పెషల్ పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. వాటికీ మంచి స్పందన లభించింది. అయితే క్రిటిక్స్ నుంచి యునానిమస్ పాజిటివ్ టాక్ రాలేదు. తమది 20 కోట్ల నిర్మాణ వ్యయంతో తీసిన సినిమా అని, తమ సినిమాను సపోర్ట్ చేయాలని బెల్లంకొండ రిక్వెస్ట్ చేశారు. సెకండ్ డే నుంచి ఆడియన్స్ వస్తారేమో చూడాలి.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన 'కిష్కింధపురి' చిత్రానికి కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం వహించారు. 'చావు కబురు చల్లగా' తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన చిత్రమిది. షైన్ స్క్రీన్ పతాకం మీద సాహు గారపాటి ప్రొడ్యూస్ చేశారు. హైపర్ ఆది, సుదర్శన్, తనికెళ్ళ భరణి, ప్రేమ, శాండీ మాస్టర్ తదితరులు నటించారు.