స్కూల్ లైఫ్ అంటే పుస్తకాలు, చదువులతో సరిపోతుంది. హీరోలు, సామాన్యులు అని వ్యత్యాసం ఏమీ ఉండదు. బుద్దిగా చదివి చక్కగా పరీక్షలు రాయాల్సిందే. స్కూల్ లో చదివినప్పుడు ప్రతి ఒక్కరికీ ఇష్టమైన సబ్జెక్ట్ ఏదో ఒకటి ఉంటుంది. అలాగే, బాగా కష్టపెట్టిన సబ్జెక్ట్ కూడా ఉంటుంది. యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh)కు బాగా ఇష్టమైన, కష్టమైన సబ్జెక్ట్స్ ఏంటో తెలుసా?


సైన్స్ అంటే ఇష్టం... 
మ్యాథ్స్ - చచ్చేంత భయం!
తనకు సైన్స్ అంటే ఎంత ఇష్టమో... మ్యాథ్స్ అంటే అంత భయమని అడివి శేష్ తెలిపారు. స్కూల్ స్టూడెంట్స్ సిలబస్ బాగా అర్థం చేసుకోవడం కోసం హ్యాపీ లెర్నింగ్ సొల్యూషన్స్ అనే సంస్థ 'గుడ్ స్కూల్' అని ఓ యాప్ రూపొందించింది. అడివి శేష్ చేతుల మీదుగా ఆ యాప్ లాంచ్ అయ్యింది. ఆ కార్యక్రమంలో తనకు ఇష్టమైన, కష్టమైన సబ్జెక్ట్స్ డీటెయిల్స్ ఆయన చెప్పారు. 


'గుడ్ స్కూల్' యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో అడివి శేష్ పిల్లలకు ఓ సలహా కూడా ఇచ్చారు.... చదవడం ఎంత ముఖ్యమో, చదివినది గుర్తు పెట్టుకోవడం కూడా అంతే ముఖ్యమని చెప్పారు. ఏదో ఒకటి చదువుతూ వెళ్లిపోకుండా... చదివినది గుర్తు ఉండేలా చూసుకోవాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు గుడ్‌ స్కూల్‌ యాప్‌ ఛైర్మన్‌  వెంకట్‌రెడ్డి, ఎండీ శ్రీనివాసరావు, సీఈవో విజయ్‌ భాస్కర్‌, పున్నమి కృష్ణ, మేములపాటి శ్రీధర్‌, అజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Also Read : ఏపీ ఎన్నికలే టార్గెట్‌గా బాలకృష్ణతో బోయపాటి పొలిటికల్ ఫిల్మ్?






హాలీవుడ్ తరహాలో కొత్త సినిమా!
ప్రస్తుతం అడివి శేష్ చేస్తున్న సినిమాలకు వస్తే... 'గూఢచారి 2' (G2 Movie Adivi Sesh) చేస్తున్నారు. ఆయన హీరోగా 2018లో వచ్చిన సూపర్ హిట్ సినిమా 'గూఢచారి'కి సీక్వెల్ ఇది. దీనిని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా రూపొందిస్తున్నారు. 'మేజర్'తో అడివి శేష్ హిందీకి వెళ్లారు. ఆ సినిమాకు అక్కడ మంచి స్పందన లభించింది. అందుకని, 'గూఢచారి 2'ను కూడా హిందీలో రిలీజ్ చేసేలా చేస్తున్నారు. దీని తర్వాత హాలీవుడ్ తరహా సినిమా చేయనున్నట్టు అడివ్వి అడివి శేష్ తెలిపారు. 


'గూఢచారి 2' విషయానికి వస్తే... వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 'మేజర్' సినిమాకు ఎడిటింగ్ వర్క్ చేసిన ఇద్దరిలో ఆయన ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. మొదటి భాగానికి సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాల రెండో సినిమాకూ సంగీతం అందిస్తున్నారు. 


'గూఢచారి 2' సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. 'కార్తికేయ 2'తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, 'ది కశ్మీర్ ఫైల్స్'తో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఉత్తరాదిలో కూడా విజయాలను అందుకున్నాయి. ఆ సంస్థల నుంచి వస్తున్న సినిమా అంటే క్రేజ్ కొంచెం ఉంటుంది. పైగా, 'మేజర్'తో అడివి శేష్ హిట్ అందుకని ఉన్నారు. అందుకని, ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. 


Also Read : చావడానికి అయినా సిద్ధమే - విష్ణుతో గొడవపై ఓపెన్ అయిన మనోజ్