Adipurush Box Office Collection Day 3: బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ సృష్టించిన ‘ఆదిపురుష్’ జూన్ 16న థియేటర్లలోకి వచ్చి.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹140 కోట్లతో రికార్డ్ బద్దలు కొట్టింది. విజువల్ ఎఫెక్ట్స్, సినిమాలో కొన్ని డైలాగ్‌లపై విమర్శలను ఎదుర్కొంటునప్పన్నప్పటికీ, ‘ఆదిపురుష్’ ప్రపంచవ్యాప్తంగా వారాంతంలో ₹340 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది.


350 కోట్ల రూపాయల మార్కుకు చేరువైన ‘ఆదిపురుష్’ 


‘ఆదిపురుష్’ చిత్రం మొదటి వారాంతంలో రూ. 340 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. విడుదలైన రోజు నుంచి ఈ రోజు వరకు అంటే విడుదలైన మూడు రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాలకొస్తే.. మొదటి రోజు (శుక్రవారం) - రూ.140 కోట్లు, రెండో రోజు  (శనివారం) - రూ. 100 కోట్లు, 3వ రోజు (ఆదివారం) - రూ.100 కోట్లు రాబట్టింది. అంతకుముందు ‘ఆదిపురుష్’ చిత్రం బాక్సాఫీస్ విజయంపై మూవీ టీం ఉత్సాహాన్ని వ్యక్తం చేసింది. "ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూనే ఉంది, బంపర్ ఓపెనింగ్‌తో అంచనాలను మించిపోయింది" అంటూ ఆనందం వ్యక్తం చేసింది.






హిందీ బాక్సాఫీస్ వద్ద ‘ఆదిపురుష్’ పరిస్థితి ఎలా ఉందంటే..


ట్రేడ్ అనలిస్టుల రిపోర్టు ప్రకారం, ‘ఆదిపురుష్’ విడుదలైన మూడు రోజుల్లోనే మొత్తం రూ. 113 కోట్లతో హిందీ వారాంతపు వసూళ్లతో రెండవ స్థానంలో నిలిచింది. బ్రేక్‌డౌన్ ప్రకారం, ఇది మొదటి రోజున రూ. 37.25 కోట్లు వసూలు చేసింది. రెండవ రోజున అది కాస్త పెరిగి రూ. 38 కోట్లకు చేరుకుంది. ఇక ‘ఆదిపురుష్’ ఆదివారం 38.25 కోట్ల వసూళ్లు రాబట్టింది. ‘ఆదిపురుష్’  హిందీ వెర్షన్ ఫస్ట్ వీకెండ్‌లో రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర  కలెక్షన్లను అధిగమించింది. ఈ సినిమా గతేడాది (2022) విడుదలై తొలి మూడు రోజుల్లో హిందీలో రూ.111 కోట్ల బిజినెస్ చేసింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ప్రభాస్‌కి ఇది నాలుగో హిందీ చిత్రం. మిగిలిన మూడు సినిమాలు బాహుబలి (2015), బాహుబలి 2(2017), సాహో (2019). 


డైలాగ్స్ ఛేంజ్..


ఇక ‘ఆదిపురుష్’ ఓ పక్క బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతుంటే.. మరో పక్క విమర్శలు కూడా పెరిగిపోతున్నాయి. రామాయణాన్ని అపహాస్యం చేశారని, సినిమాలోని డైలాగులకు రామాయణంలోని పాత్రలకు ఏం సంబంధం లేదంటూ ఏకి పారేస్తున్నారు. ఈ సినినిమాను నిలిపివేయాలంటూ కొన్ని చోట్ల నిరసనలు కూడా వెల్లువెత్తాయి. ఇంకొన్ని చోట్ల ఈ సినిమాపై వస్తోన్న నెగెటివ్ కామెంట్స్, ట్రోలింగ్ చూసి చాలా మంది తాము బుక్ చేసుకున్న టికెట్లను కూడా క్యాన్సిల్ చేశారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఇటీవలే ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రేక్షకుల కోరిక, సలహా మేరకు సినిమాలోని కొన్ని డైలాగులను మార్చడం లేదా తీసివేయడం, చేర్చడం వంటివి చేస్తామని చెప్పారు.


Read Also : 'ఖుషి' స్ట్రీమింగ్ రైట్స్ ఆ ఓటీటీకే - దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నారా?