Kushi OTT Rights: డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన పాన్-ఇండియన్ రొమాంటిక్ డ్రామా (Pan Indian Romantic Drama)'ఖుషి'లో విజయ్ దేవరకొండ, సమంతా రూత్ ప్రభు కలిసి కనిపించనున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీ సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ ను సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం... 'ఖుషి' చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ (OTT) ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)కొనుగోలు చేసింది. అయితే, మేకర్స్ గానీ, అమెజాన్ ప్రైమ్ వీడియో గానీ దీనిపై అధికారిక ప్రకటన రిలీజ్ చేయలేదు. అయితే, తాజాగా విజయ్ దేవరకొండ, సమంతలకు తగిన హిట్స్ లేకపోవడంతో.. నిర్మాతలు రిజల్ట్ రాక ముందే ఒప్పందం చేసుకుంటున్నారని సమాచారం. ఒక వేళ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా సేవ్ కావచ్చనే ప్లాన్‌తో ముందుగానే సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.
'మహానటి' తర్వాత విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తోన్న చిత్రం 'ఖుషి'. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ లవ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాను.. గతేడాది డిసెంబర్ 23న రిలీజ్ చేయబోతున్నట్లు గతంలో చిత్ర నిర్మాతలు ప్రకటించారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమా వాయిదాపడింది. స్టార్టింగ్ లో ఈ సినిమా షూటింగ్ ను గతేడాది నవంబర్ లోనే కంప్లీట్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ సమంత, విజయ్ డేట్స్ అడ్జెస్ట్‌మెంట్ కాకపోవడంతో షూటింగ్ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. పాన్ ఇండియన్ స్థాయిలో దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఖుషి సినిమాను రిలీజ్ చేయబోతుండడం విశేషం.
ఇటీవలే 'శాకుంతలం', 'సిటాడెల్' సిరీస్ ను కంప్లీట్ చేసిన సమంత.. ప్రస్తుతం 'ఖుషి' సినిమా బిజీలో పడిపోయింది. మరో వైపు విజయ్ కూడా ఈ సినిమా చేస్తూనే.. పూరి జగన్నాథ్‌తో 'జనగనమణ' సినిమాను అంగీకరించాడు. రీసెంట్ గా విడుదల చేసిన 'ఖుషి' ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో విజయ్ దేవరకొండ, సమంత ఫ్యాన్స్ లో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అప్పట్లో ఇదే 'ఖుషీ' టైటిల్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సృష్టించిన సెన్సేషన్ మరోసారి రిపీట్ అవుతుందని వీరిద్దరి అభిమానులు ఆశ పడుతున్నారు. కాగా ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్నట్టు తెలుస్తోంది. మరోపక్క 'లైగర్' సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకున్న విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలతో బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. 'ఖుషి' సినిమాతో ఆ చేదు జ్ఞాపకాలన్నింటినీ తుడిచేయాలనే లక్ష్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.
జయరామ్, సచిన్ ఖేడాకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ 'ఖుషి' చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1, 2023న థియేటర్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీత దర్శకుడు.
Read Also : JD Chakravarthy: ఒకే అమ్మాయితో నేను, వంశీ ప్రేమలో పడ్డాం - మహేశ్వరితో ప్రేమపై జేడీ చక్రవర్తి స్పందన