పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ క్రేజ్ ఎలా ఉంది? అనేది చెప్పడానికి 'ఆదిపురుష్' సినిమా వసూళ్లు ఓ ఉదాహరణ. జయాపజయాలతో సంబంధం లేకుండా సగటు సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల సత్తా ఆయనకు ఉందని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. 


మొదటి రోజే 'ఆదిపురుష్'కు వంద కోట్లు!
'ఆదిపురుష్' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానులకు నచ్చింది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన అనుకుంది. సోషల్ మీడియాలో సినిమా అసలు బాలేదని విపరీతమైన బ్యాడ్ టాక్ నడుస్తోంది. క్రిటిక్స్ రివ్యూలు, ఆడియన్స్ మౌత్ టాక్ వంటి అంశాలతో సంబంధం లేకుండా 'ఆదిపురుష్' మొదటి రోజు భారీ వసూళ్ళు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు వంద కోట్లకు పైగా వసూళ్ళు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. వందకు ఎన్ని కోట్లు ఎక్కువ కలెక్ట్ చేసిందనేది అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ మరో రేర్ రికార్డ్ క్రియేట్ చేశారు. 


ఆ ఆరులో ప్రభాస్ సినిమాలే మూడు!
ఇప్పటి వరకు మొదటి రోజు వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాలు ఆరు ఉన్నాయి. ఆ ఆరులో మూడు ప్రభాస్ సినిమాలే కావడం విశేషం. అసలు, మొదటి రోజు వంద కోట్లు వసూలు చేసిన మొదటి సినిమా 'బాహుబలి 2'. అది ప్రభాస్ సినిమాయే. ఆ తర్వాత 'సాహో'తో మరోసారి ఆయన ఆ రికార్డు అందుకున్నారు. 


'బాహుబలి 2' తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తీసిన 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సైతం మొదటి రోజు వంద కోట్ల రూపాయల గ్రాస్ మార్క్ అందుకుంది. మూడు తెలుగు సినిమాలు ఈ రికార్డ్ క్రియేట్ చేశాక... కన్నడ రాక్ స్టార్ యశ్ సినిమా 'కెజియఫ్ 2', బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన హిందీ సినిమా 'పఠాన్' సైతం మొదటి రోజు వంద కోట్లు వసూలు చేశాయి. ఇప్పుడు 'ఆదిపురుష్' కూడా ఈ లిస్టులో చేరింది. 


ఫస్ట్ వీకెండ్ రికార్డులు పక్కా!
'ఆదిపురుష్' విడుదలకు ముందు సినిమా మీద విపరీతమైన బజ్ నెలకొంది. ఇది రామాయణం నేపథ్యంలో తీసిన సినిమా కావడంతో ప్రభాస్ అభిమానులతో పాటు రామ భక్తులు సైతం ఆసక్తి చూపించారు. అందువల్ల, ఫస్ట్ వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ నేపథ్యంలో వీకెండ్ తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. 


Also Read : 'ఆదిపురుష్'కు ఫ్లాప్ టాక్ వెనుక టాప్ 5 రీజన్స్ - ఏంటిది ఓం రౌత్?



'ఆదిపురుష్'లో రాఘవ / శ్రీ రామ చంద్ర మూర్తి పాత్రలో ప్రభాస్ నటించగా... ఆ రామ పత్ని జానకి / సీతా దేవి పాత్రలో కృతి సనన్ కనిపించారు. శేషు పాత్రలో సన్నీ సింగ్, లంకాధిపతి రావణ బ్రహ్మ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. హనుమాన్ పాత్రను మరాఠీ నటుడు దేవదత్తా నాగే పోషించారు. ఆయన నటనకు సర్వత్రా మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకుంది.


Also Read : ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసిన విజయ్ దేవరకొండ - టైటిల్ అదేనా?