'ఆదిపురుష్' థియేటర్లలోకి వచ్చింది. ఎర్లీ మార్నింగ్ షో చూసిన విమర్శల నుంచి మిశ్రమ స్పందన లభించింది (Adipurush Movie Review). ముక్త కంఠంతో సినిమా బావుందని చెప్పడం లేదు. పాన్ ఇండియా రెబల్ స్టార్, మన 'బాహుబలి' ప్రభాస్ అభిమానులకు నచ్చింది. శ్రీరాముని భక్తులు కొందరి నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. అయితే... అదే సమయంలో విపరీతమైన నెగిటివ్ టాక్ వచ్చింది. వై? 'ఆదిపురుష్' నచ్చలేదని జనాలు ఎందుకు చెబుతున్నారు? సినిమాపై నెగిటివిటీకి రీజన్ ఏమిటి? టాప్ 5 పాయింట్స్ చదవండి (Adipurush Movie Negative Talk Reasons)


రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ లుక్
రావణుడు రాక్షస రాజు. అతడిని రాక్షసుడని అంటుంటారు. అయితే... మహాజ్ఞాని! పండితులు కూడా! సీత విషయంలో తప్పు చేశాడేమో కానీ మిగతా విషయాల్లో మంచోడని పలువురి విశ్వాసం. అందుకే, రావణ బ్రహ్మ అనేది! అటువంటి రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ గెటప్ బాలేదు. నటన, నడక కూడా!
 
''అహో రూపమహో ధైర్యమహో
సత్త మహో ద్యుతిఃఅహో రాక్షసరాజస్యసర్వలక్షణయుక్తతా'' 


- వాల్మీకి రాసిన రామాయణంలో శ్లోకం ఇది. లంకకు వెళ్లొచ్చిన హనుమంతుడు... రావణుడి గురించి ఈ విధంగా వర్ణించాడని ఆయన పేర్కొన్నారు. లంకేశ్వరుడి వర్ణన కోసం బీభత్స భయానక రసాలను వాల్మీకి ఆశ్రయించారు. ధగధగ్గాయమానంగా వెలిగిపోతున్న స్వర్ణ సింహాసనం మీద దర్పంగా ఆశీనుడైన రావణుడు... సమృద్ధిగా నెయ్యి పోసిన అగ్నిలా, భగభగ మండుతున్న హోమాగ్ని వలే కనిపిస్తాడని పేర్కొన్నారు. లంకేశుడి శౌర్య పరాక్రమాల గురించి గొప్పగా వర్ణించారు. నవాబ్ వారసుడు, సైఫ్ అలీ ఖాన్ ఆహార్యం అలా లేకపోవడం విమర్శలకు కారణమైంది. 


లంక అలా ఉందేంటి? ఆ లుక్స్ ఏంటి?
రామాయణంలో లంక అంటే ఇప్పటి శ్రీలంక. భూమి మీద అదీ ఒక భాగమే. లంక అంటే అదేదో వేరే లోకం అన్నట్లు దర్శకుడు ఓం రౌత్ చూపించారు. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో లోకాన్ని డిజైన్ చేసినట్టు డిజైన్ చేశారు. లంకలో రావణుడిని సైన్యాన్ని గ్రహాంతర వాసుల తరహాలో చూపించారు. 


'విరాజమానం వపుషాగజాశ్వరథసంకులమ్'


లంకానగర వైభోగాన్ని చూసి హనుమంతుడు 'ఔరా' అంటూ ఆశ్చర్యపోతాడు.  ఆ భవనాల గురించి గొప్పగా వర్ణించారు. దేవశిల్పి విశ్వకర్మ నిర్మాణ కౌశలమది. లంక ముందు కుబేరుడి అలకాపురి, ఇంద్రుడి అమరావతి చిన్నబోవాల్సిందే. రావణుడి నివాసం కాంతలతో, వజ్ర వైఢూర్య కాంతులతో వెలిగిపోయేది. ఒక్క మాటలో చెప్పాలంటే లంకను భూలోక స్వర్గంగా వర్ణించారు. 'ఆదిపురుష్'లో లంక చూస్తే అలా లేదు.      


ప్రభాస్ లుక్... ఇంటర్వెల్ తర్వాత సీన్!
'ఆదిపురుష్'లో మీసాల రాముడిగా ప్రభాస్ (Prabhas)ను చూపించడంపై విడుదల కంటే ముందు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే... సినిమా విడుదల సరికి లుక్ మీద పెద్దగా విమర్శలు రాలేదు. యుద్ధ సన్నివేశాల్లో బావున్నాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే... ఇంటర్వెల్ తర్వాత తండ్రి దశరథ మహారాజుతో రాముడు మాట్లాడే సన్నివేశాల్లో లుక్ మీద విమర్శల జడివాన మొదలైంది. తెల్లటి దుస్తుల్లో ప్రభాస్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


'బాహుబలి' యుద్ధం చూసినట్టు ఉందేంటి?
రామ రావణ యుద్ధంలో కొన్ని సన్నివేశాలు 'బాహుబలి'లో యుద్ధాన్ని పోలినట్టు ఉందని అభిమానులు సైతం విమర్శలు చేస్తున్నారు. యుద్ధం కొత్తగా ఉంటే బావుండేదని అంటున్నారు. రామ రవాణ యుద్ధం అంత ఆసక్తిగా సాగలేదు. రావణుడిని రాముడు త్వరగా చంపేస్తే థియేటర్ నుంచి బయట పడొచ్చనే విధంగా తీశారు. 


డబ్బింగ్ సీన్లు, లిప్ సింక్ లేదు!
ప్రభాస్ మినహా 'ఆదిపురుష్'కు పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల్లో మెజారిటీ శాతం ఉత్తరాది జనాలు ఉన్నారు. వాళ్ళలో తెలుగు పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నది చాలా తక్కువ మందికి. దర్శకుడు కూడా హిందీ వ్యక్తి కావడంతో చాలా సీన్లు హిందీలో తీశారని సినిమా చూస్తుంటే అర్థం అవుతోంది. కొన్ని సీన్లలో డబ్బింగ్, లిప్ సింక్ మధ్య సమన్వయం కుదరలేదు. అదీ నెగిటివ్ టాక్ రావడానికి ఓ రీజన్!


Also Read : 'ఆదిపురుష్' రివ్యూ : రామాయణానికి మోడ్రన్ టచ్ - ప్రభాస్ సినిమా ఎలా ఉందంటే?



'ఆదిపురుష్' టీజర్ విడుదల తర్వాత విమర్శలు విపరీతంగా వచ్చాయి. ట్రైలర్ బావుండటంతో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే... చాలా మంది సినిమా పట్ల ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్ళారు. అందువల్ల, సినిమా ఓకే ఓకే అనిపించింది. అంచనాలు పెట్టుకున్న జనాలను మాత్రం డిజప్పాయింట్ చేసింది.


Also Read : రూ. 600 కోట్ల పనితనం ఇదా? రావణుడి గ్రాఫిక్స్ పై నెటిజన్ల సెటైర్లు