సినిమా రంగం అనేది ఎవరిని ఎప్పుడు ఎలా మారుస్తుందో చెప్పడం కష్టం. అనామకులను ఓవర్ నైట్ స్టార్లుగా మార్చిన సంఘటనలు ఉన్నాయి. స్టార్ యాక్టర్లను రాత్రికి రాత్రే రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితీ ఉంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఓ నటీమణి, ఆ తర్వాత అవకాశాలు లేక రోడ్డు మీద బిక్షాటన చేస్తూ దుర్భర జీవితాన్ని గడిపింది. ఆ తర్వాత ఆకలి తీర్చుకునేందుకు దొంగతనం చేస్తూ పట్టుపడింది. ఆమెను పోలీసులు జైలుకు పంపించారు. ఆ తర్వాత మానసిక ఆశ్రమానికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఎలా ఉందో సమాచారం మాత్రం లేదు. ఇంతకీ ఆమె ఎవరంటే?


సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాలని ఎంతో మంది కోరుకుంటారు. కానీ, అందరూ రాణించలేరు. సినిమా అవకాశాల కోసం చాలా మంది ముంబైకి వెళ్తుంటారు. కానీ, కొంత మంది మాత్రమే నటులుగా సక్సెస్ అవుతారు. ఎంత ప్రయత్నం చేసినా అవకాశాలు రాక వెనుతిరిగేవారు ఎంతో మంది ఉంటారు. అలాంటి వారి జీవితం ఒక్కోసారి దారుణంగా తయారవుతుంది. ఇప్పుడు అలా మారిపోయిన ఓ నటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. 


భోజ్‌పురి సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్


మిథాలీ శర్మ (Mitali Sharma) భోజ్‌పురి సినిమా పరిశ్రమలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగింది.  భోజ్‌పురి దర్శకులు, నిర్మాతలకు ఆమె ఫస్ట్ ఛాయిస్ గా ఉండేది. కానీ, ఆమె సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ కావడం, ఆ తర్వాత అవకాశాలు లభించకపోవడంతో మిథాలీ శర్మ జీవితం మారిపోయింది. ఆమె బతకడం కోసం ముంబైలోని లోఖండ్‌వాలా వీధుల్లో భిక్షాటన చేసింది. ఆకలి తీర్చుకునేందుకు దొంగతనం చేస్తూ పట్టుబడింది. ఆమెను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.  లేడీ పోలీసులు ఆమెకు సంకెళ్లు వేయడానికి ప్రయత్నించినప్పుడు వారిని నోటికి వచ్చినట్లు తిట్టింది.  పారిపోవడానికి ప్రయత్నించి అప్పట్లో వార్తలోకి ఎక్కింది.  


ఆకలి తీర్చుకునేందుకు దొంగతనం


నిజానికి మిథాలీ శర్మ ఢిల్లీకి చెందిన అమ్మాయి. తొలుత మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత నటి కావాలనుకుంది. తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి  ఇంటిని వదిలి ముంబైకి వచ్చింది. మిథాలీ శర్మ  ముంబైకి వెళ్లడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను మళ్లీ ఇంట్లోకి రావద్దని చెప్పారు. ముంబైలో కొన్ని సినిమాలు చేసింది. మోడలింగ్ లోనూ రాణించింది. ఆ తర్వాత చాలా కాలం పాటు అవకాశాలు రాలేదు.  డబ్బు లేకపోవడం ఆమెను డిప్రెషన్ లోకి వెళ్లింది.  మితాలీ శర్మను పోలీసులు అరెస్ట్ చేసి,  స్టేషన్‌కు తీసుకెళ్లినప్పుడు తనకు భోజనం పెట్టమని అడగడం అప్పట్లో అందరినీ కంటతడి పెట్టించింది. ఆ తర్వాత పోలీసులు ఆమెను థానేలోని మానసిక ఆశ్రమంలో చేర్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఆమె అదే ఆశ్రమంలో ఉందా? లేదా? అనే విషయాలు మాత్రం తెలియదు. ఒకప్పుడు చక్కటి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె జీవితం ఊహించని మలుపులు తిరగడం అందరినీ ఆవేదనకు గురించి చేసింది.


Read Also: మర్చిపోయిన హీరోయిన్లను మళ్లీ గుర్తు చేసింది, శ్రీలీల‌పై దిల్ రాజు ప్రశంసల వర్షం



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial