Varalakshmi Sarathkumar Engaged: సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్‌ కుమార్‌ - వరుడు ఎవరంటే..

Varalakshmi Sarathkumar: నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ పెళ్లి పీటలు ఎక్కబోతుంది. తాజాగా ఆమె సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా బయటకు రాగా అవి వైరల్‌గా మారాయి.

Continues below advertisement

Varalakshmi Sarathkumar Engagement: విలక్షణ నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ పెళ్లి పీటలు ఎక్కబోతుంది. తాజాగా ఆమె సీక్రెట్‌గా నిశ్చితార్తం చేసుకుంది. తన చిరకాల మిత్రుడు, గ్యాలరీస్ట్‌ నికోలాయితో నేడు మార్చి 1న ముంబయిలో నిశ్చితార్థం చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో బయటకు రాగా అవి వైరల్‌గా మారాయి. వరలక్ష్మి ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ముంబయిలో జరిగిన ఈ నిశ్చితార్థం వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, కొద్ది మంది సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. ముంబయికి గ్యాలరిస్ట్ నికోలాయి సచ్‌దేవ్‌తో వరలక్ష్మి 14 ఏళ్లుగా పరిచయం ఉందట. ఇండస్ట్రీకి పెద్దగా సంబంధం లేని వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకోబోతుంది. కాగా, వరుడుకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Continues below advertisement

Also Read: భర్త విఘ్నేశ్ శివన్‌ను అన్‌ఫాలో చేసిన నయనతార? ఇదిగో క్లారిటీ!

అయితే ఆమెది ప్రేమ పెళ్లని తెలుస్తోంది. నికోలాయితో వరలక్ష్మి 14 ఏళ్లుగా పరిచయం ఉందని, అదీ ప్రేమగా మారడంతో పెద్ద సమ్మతంలో ఇద్దరు త్వరలో ఏడడుగులు వెయబోతున్నారు. ఉందట. కాగా స్కూలింగ్‌ నుంచి వీరికి పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. లాంగ్‌ రిలేషన్‌ అనంతరం వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ సందర్భంగా వరలక్ష్మి సన్నిహితులు, ఇండస్ట్రీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఇలా వరలక్ష్మి సైలెంట్‌ నిశ్చితార్థం చేసుకోవడం ఫ్యాన్స్‌, ఆడియన్స్‌ని షాకిస్తుంది. కాగా ప్రముఖ నటుడు శరత్‌ కుమార్‌ నట వారసురాలిగా వరలక్ష్మి ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమిళంలో హీరోయిన్‌గా పరిచయమైన ఆమె ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించింది. మెల్లిమెల్లిగా విలన్‌ రోల్స్‌ చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇక తెలుగులో లేడీ విలన్‌ పాత్రలకు వరలక్ష్మి ఫుల్‌ క్రేజ్‌ పొందింది. 

రీసెంట్‌గా హనుమాన్‌ చిత్రంతో మెప్పించిన ఆమె తెలుగు, తమిళంలో పలు ప్రాజెక్ట్స్‌ బిజీగా ఉంది. ఇలా నటి కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే వరలక్ష్మి నిశ్చితార్థం చేసుకోవడం గమనార్హం. కాగా గతంలో వరలక్ష్మి పెళ్లంటూ చాలా సార్లు రూమర్స్‌ వినిపించాయి. హీరో విశాల్‌తో ప్రేమలో ఉందని, వారికి త్వరలోనే పెళ్లన్నారు. కానీ తండ్రికి ఇష్టం లేకపోవడంతో వరలక్ష్మి విశాల్‌కు బ్రేకప్‌ చెప్పిందంటూ తమిళ మీడిమాల్లో కథనాలు వచ్చాయి. ఆ తర్వాత హీరో శింబుతో ప్రేమ, పెళ్లంటూ కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరిగింది.  అయితే అవి వార్తలకే పరిమితమయ్యాయి. కానీ చివరికి 38 ఏళ్ల వయసులో తన చిరకాల మిత్రుడు నికోలాయితో పెళ్లి రెడీ అయ్యింది. ఈ ఏడాదిలోనే వీరి పెళ్ల జరగనుందని సన్నిహితుల నుంచి సమాచారం. 

Continues below advertisement
Sponsored Links by Taboola