Nayanthara Unfollow Husband Vignesh Shivan: లేడీ సూపర్ స్టార్ నయనతార ఇప్పుడు హాట్‌టాపిక్ అయ్యారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన ఆమె తన లైఫ్‌లోని ఇంపార్టెంట్ వ్యక్తిని అన్‌ఫాలో చేసిందంటూ వార్తలు గుప్పమన్నాయి. అదేంటీ నయన్ ఇలా చేసిందంటూ ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. ఇటీవల కాలంలో నటీనటులు విడాకులకు ముందు సోషల్ మీడియాలో హింట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతతో మొదలు సెలబ్రెటీలంతా ఆమెనే ఫాలోఅవుతున్నారు. భర్త చైతన్యతో విడిపోవడానికి సామ్ తన ఇన్‌స్టాలో పేరు మార్చింది. ఆ తర్వాత అన్‌ఫాలో చేసింది.
భర్తను అన్‌ఫాలో చేసి..
మెల్లిగా పెళ్లి ఫోటోలు డిలిట్ చేసింది. దాంతో విడాకులు తీసుకునే సెలబ్రిటీ జంటలు ముందు సోషల్ మీడియాలో ఒకరినోకర్ అన్‌ఫాలో చేసుకుంటున్నారు. ఇప్పుడు నయన్ కూడా అదే చేసిందంటూ తాజాగా వార్తలు వచ్చాయి. తన భర్త విఘ్నేశ్ శివన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసిందని తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో ఫ్యాన్స్ అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు ఎంతో అన్యోనంగా ఉన్న ఈ జంట నుంచి బ్యాడ్ న్యూస్ ఏమైనా వినిపించనుందా? ఫ్యాన్స్ కంగారు పడ్డారు. ఇదేంటి నయన్ ఇలా చేసింది.. అసలు ఏ జరుగుతుందని అంతా డైలామాలో పడ్డారు. రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఏమైందా? అని అభిమానులంతా చర్చించుకున్నారు. అయితే నయన్ అంతలోనే బిగ్ ట్విస్ట్ ఇచ్చింది.
ట్విస్ట్ ఇచ్చిన నయన్
భర్తను అన్‌ఫాలో చేసిందంటూ ఇలా వార్తలు వచ్చాయో లేదో అంతలో నయన్ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. మళ్లీ భర్తను ఫాలో అయ్యి నెటిజన్లకు షాకిచ్చింది. దీంతో నయన్ ఎందుకు ఇలా చేసిందని, కావాలని ఇలా చేసిందా? లేక అందరిని ఆటపట్టించిందా? తెలియదు. కానీ ఇది చూసి ఫ్యాన్స్ మాత్రం రిలాక్స్ అవుతున్నారు. హమ్మయ్య వారిద్దరు బాగానే ఉన్నారు అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు అభిమానులంతా. కొందరు పొరపాటున అన్‌ఫాలో చేసిందేమో.. తెలిసి మళ్లీ ఫాలో అవుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే విఘ్నేశ్ శివన్ మాత్రం నయన్‌ను ఫాలో అవ్వవడం లేదు. మరి ఈ జంట మధ్య ఏం జరుగుతుందనేది ప్రస్తుతం అభిమానులను తొలుస్తున్న ప్రశ్న.
కాగా అయిదేళ్లు ప్రేమలో మునిగితేలిన ఈ జంట 2022 జూన్‌లో మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇరుకుటుంబ సభ్యులు, ఇండస్ట్రీ ప్రముఖులు, సన్నిహితులు సమక్షంలో ఈ జంట రెండేళ్ల క్రితం ఏడడుగులు వేశారు. పెళ్లయిన ఆరు నెలలకు వీరికి ఇద్దరు కవలలు జన్మించిన సంగతి తెలిసిందే. సరోగసి ద్వారా నయన్-విఘ్నేశ్ శివన్‌లు కవలలకు తల్లదండ్రులయ్యారు. అప్పట్లో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక పెళ్లి తర్వాతే ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన నయన్ తరచూ తన కుమారుల ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ మురిసిపోతుంది. అయితే ఆమెకు ఇన్‌స్టాలో ప్రస్తుతం 78 లక్ష ఫాలోవర్స్ ఉన్నారు.
Also Read: అన్నపూర్ణ-చిన్మయి వివాదంపై మాధవిలత షాకింగ్ కామెంట్స్ - సమాజం అన్నాక అన్నీ ఉంటాయి, కానీ..