Maadhavi Latha On Chinmayi-Annapoorna Controversy: సినీ నటి మాధవీ లత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘న‌చ్చావులే’, 'స్నేహితుడా' వంటి చిత్రాలతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందింది. ఇక అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్న మధవిలత అప్పుడప్పుడు సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె చేసే వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా నిలుస్తాయి. అయితే తాజాగా మాధవిలత చిన్మయి శ్రీపాద, సీనియర్‌ నటి అన్నపూర్ణ వ్యవహరంపై స్పందించింది. ఆడవాళ్లు రాత్రిళ్లు బయట తిరగడం కరెక్ట్‌ కాదని, ఎక్స్‌పోజింగ్‌ వల్లే లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరుగుతున్నాయంటూ అన్నపూర్ణ పేర్కొన్నారు. 


యూకేలో అసలు రకణ లేదు..


ఆమె కామెంట్స్‌పై స్పందించిన చిన్మయి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆడవాళ్లు అసలు బయటకు వెళ్లొద్దని, డెలివరి కూడా సాయంత్రం వేళల్లో చేసుకోవద్దంటూ తనదైన స్టైల్లో మాట్లాడింది. ఇది తీ్రవ చర్చకు దారి తీసింది. తాజాగా దీనిపై బిగ్‌ టీవీ పెట్టిన డిబెట్‌లో మాధవి లత తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "ఒక్క మన దేశంలోని ఆడవాళ్లపై అఘాత్యాలు జరుగుతాయనడమేనది పిచ్చితనం. ఇది మనిషి ఆలోచన సరళిపై ఆధారపడి ఉంటుంది. మోడ్రన్‌ డ్రెస్‌లు వేసుకుంటున్న ప్రతి అమ్మాయిపై లైంగిక వేధింపులు జరగడం లేదు కదా. వారికి బాయ్స్‌ ఫ్రెండ్స్‌ సర్కిల్‌ ఎక్కువ ఉంటుంది. షార్ట్‌ షార్ట్‌ డ్రెస్సులు వేసుకుంటారు. కానీ వారు కామంతో చూడరు. కదా. మనదేశంలోనే ఇలాంటివి జరగడం లేదు. మన దేశంలో ఉన్నంత ఫ్రీడమ్‌ కూడా కొన్ని దేశాల్లో లేదు. రీసెంట్‌గా యూకే గురించి విన్నాను. 


అక్కడ రాత్రి అయితే ఎవరూ బయట వెళ్లరు. రాత్రి తొమ్మిది గంటల తర్వాత అక్కడ రక్షణ అనేది లేదు. తొమ్మిది తర్వాత ఎవరూ బయటకు రారు. మరి అక్కడ ఇలాంటి ఘటనలు జరగావా? అంటే జరుగుతాయి. ఇది కేవలం వ్యక్తి ఆలోచనపై ఆధారపడి ఉంది. మోడ్రన్‌ డ్రెస్సుల వల్ల ఇలాంటి దరిద్రాలు జరుగుతున్నాయంటే మరి చిన్నపిల్లలు, ముసలివాళ్లపై కూడా రేప్‌లు జరుగుతున్నాయి. మరి వారు ఏం చేస్తున్నారు. డ్రెస్సింగ్‌పై నేనూ తప్పు పట్టను. ఇంట్లో తల్లిదండ్రులు మారాలి. పిల్లలను పెంచే విధానంలో ఉంటుంది. ఇంట్లో తండ్రి తాగోచ్చి భార్యను తిట్టడం కొట్టడం చేస్తుంటారు. అది పిల్లల ముందే కొట్టకోవడం, తిట్టుకోవడం చేస్తారు. ఇది వారిపై ప్రభావం పడుతుంది. తండ్రి వాళ్లమ్మను ఇష్టం వచ్చినట్టు తిట్టడం కొట్టడం చేయడం వల్ల అమ్మాయిలపై వారికి రెస్పాక్ట్‌ అనేది తగ్గుతుంది. వారు కూడా బయట అమ్మాయిలపై కామెంట్స్‌ చేయడం, తిట్టడం వంటివి చేస్తారు. ఇదే క్రమంలో లైంగిక దాడులు జరుగుతాయి. కాబట్టి ఫస్ట్‌ పెరెంటింగ్‌ అనేది మారాలి" అంటూ చెప్పుకొచ్చారు. 






రీల్స్‌ అలా చేయడం అవసరమా?


"అదే విధంగా రీల్స్‌ గురించి కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య రీల్స్‌లో ఎక్స పోజింగ్‌ ఎక్కువైంది. మోడ్రన్‌ డ్రెస్సులు వేసుకోండి. కానీ ప్రైవేటు పార్ట్స్‌, నడుము చూపిస్తు రీల్స్‌ చేయడం అవసరమా? ఇలాంటి ధోరణి మార్చుకోవాలి. డ్రెస్సుల వల్ల కూడా రేప్‌ అటెంప్ట్‌ జరుగుతున్నాయి కూడా. అలా అని డ్రెస్సింగ్‌ విధానాన్ని తప్పుపట్టడం లేదు. కానీ కాస్తా యువత మరాలి. నేను సమాజంలో జరిగే ఘటనలను ఉద్దేశించి మాట్లాడుతున్న. సమాజం అంటే అన్ని కలిసి ఉంటాయి. ఒక ట్రాక్‌లోనే అన్ని వెళ్లవు కదా. ఈ రోజుల్లో చాలామంది యూత్‌ పోర్న్‌ సైట్స్‌ చూస్తున్నారట. అవన్ని యువత ఆలోచనపై ప్రభావం చూపిస్తాయి . దాంతో వారికి ఏం తొస్తే అది చేస్తున్నారు. కాబట్టి మనిషికి తనమీద తనకు కంట్రోలింగ్‌ ఉండాలి. ఆలోచన బట్టి వెళ్లకూడదు. మైండ్‌సెట్‌పై కంట్రోలింగ్‌ అనేది ఇంటి నుంచే మొదలు కావాలి. అది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పించాలి" అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.