సీనియర్ నటి రంభ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు రీ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నానంటూ దర్శక నిర్మాతలకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 90లలో ఈ హీరోయిన్ పేరు ఇండస్ట్రీలో మార్మోగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ తో మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది.
సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తానంటున్న రంభ
ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఆ ఒక్కటి అడక్కు' మూవీతో రంభ హీరోయిన్ గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీనే హిట్టు కావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత చాలా మంది స్టార్ హీరోలతో ఆడిపడింది ఈ అమ్మడు. అల్లరి ప్రేమికుడు, అల్లుడా మజాకా, బొంబాయి ప్రియుడు, బావగారు బాగున్నారా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం సినిమాలు చేసింది రంభ. అన్ని భాషల్లోనూ కలిపి ఆమె 50కి పైగా సినిమాలు చేసింది. ఇక కొన్నాళ్ళ తరువాత ఐటెం సాంగ్స్ చేయడానికి కూడా ఆమె వెనకాడలేదు. అందులో భాగంగానే దేశముదురు, యమదొంగ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి ఆడియన్స్ ని ఊపేసింది. గ్లామర్, యాక్టింగ్, గ్రేస్ ఫుల్ స్టెప్పులతో అప్పటి ఆడియన్స్ ని ఫిదా చేసిన ఈ అమ్మడు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్ధమవుతోంది.
ఈ విషయం గురించి రంభ మాట్లాడుతూ "ఇప్పుడు ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి అయినా నేను సిద్ధంగా ఉన్నాను. నా ఫస్ట్ ఛాయిస్ సినిమానే. అయితే ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వడానికి సరైన సమయం అని నేను అనుకుంటున్నాను. కొత్త పాత్రలను సెలెక్ట్ చేసుకుని, మళ్ళీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి ఎదురు చూస్తున్నాను" అంటూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నటిగా తన కెరీర్ లో రంభ ఎన్నో మరుపురాని క్లాసిక్ సినిమాలను అందించిన రంభ, గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. అలాంటిది ఇప్పుడు తను మరోసారి తెరపై సందడి చేయడానికి సిద్ధమంటూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమె అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. అంతేకాకుండా ఆమె రీఎంట్రీలో ఎలాంటి సినిమాలు చేయబోతుందా ? అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
రంభ పర్సనల్ లైఫ్
చివరగా 'వాడొస్తాడు' అనే మూవీలో మెరిసిన రంభ మలేషియాకు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఇటీవల రంభ పిల్లలు తమిళ స్టార్ దళపతి విజయ్ తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అందులో రంభతో పాటు ఆమె పిల్లలు క్యూట్ గా కన్పించారు.
Also Read: 'శబ్దం' రివ్యూ: బొమ్మ భయపెట్టేలా ఉందా? ఆది పినిశెట్టి హారర్ థ్రిల్లర్ హిట్టేనా? కాదా?