Jagapathi Babu Interview With Meena Jayammu Nischayammura Movie: చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ తర్వాత రజినీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్లతో ఎన్నో హిట్ మూవీస్‌లో అలరించారు సీనియర్ హీరోయిన్ మీనా. తాజాగా జగపతిబాబు 'జయమ్ము నిశ్చయమ్మురా' షోలో తన కెరీర్, పర్సనల్ లైఫ్, మూవీస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.
ఆ క్యాంపెయిన్‌కు నేనూ వెళ్లాల్సింది
హీరోయిన్ సౌందర్య తాను చాలా మంచి స్నేహితులమని... ఆమె చాలా మంచి అమ్మాయి అని మీనా చెప్పారు. ఎలక్షన్ క్యాంపెయిన్‌కు వెళ్లి హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆమె చనిపోవడం చాలా బాధాకరమని అన్నారు. 'నిజానికి ఆ క్యాంపెయిన్‌కు నన్ను కూడా రమ్మని పిలిచారు. అప్పుడు నేను షూటింగ్స్‌లో చాలా బిజీగా ఉన్నా. దానికి తోడు ఎన్నికల ప్రచారం అంటే నాకు పెద్దగా ఆసక్తి లేదు. అందుకే వెళ్లలేదు. ఆ రోజు హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్యను కోల్పోవడం చాలా బాధ కలిగించింది.' అంటూ ఎమోషన్ అయ్యారు మీనా.
భర్త చనిపోయిన వారం తర్వాత నుంచే...
మీనా భర్త విద్యా సాగర్ 2022లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్‌పై తాజాగా ఇంటర్వ్యూలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు మీనా. 'నా భర్త చనిపోయిన వారానికే నేను మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు రాశారు. దీనిపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. వీళ్లకసలు మనసు ఉండదా? ఫ్యామిలీస్ ఉండవా? ఇలా ఎందుకు రాస్తున్నారు? అని అనిపించేది. ఆ తర్వాత కూడా ఆ రూమర్స్ అలాగే కొనసాగించారు.
ఎవరు డివోర్స్ తీసుకున్నా నాతోనే పెళ్లి అని రాసేవారు. అలాంటి రాతల వల్ల చాలా అసహ్యం వేసేది. నా భర్తను కోల్పోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. దాదాపు రెండేళ్ల పాటు ఆ బాధ నుంచి కోలుకోలేకపోయాను. అలాంటి టైంలో నా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్‌గా నిలిచారు. ఆ బాధ నుంచి నేను బయటపడేలా చేశారు. అలాంటి మంచి ఫ్రెండ్స్ ఉన్నందుకు నేను చాలా లక్కీ అనిపిస్తుంది.' అని చెప్పారు మీనా.
Also Read: మహేష్ 'SSMB29' బిగ్గెస్ట్ అడ్వెంచర్ కోసం బిగ్ సెట్... హైదరాబాద్‌లో ఫేమస్ టెంపుల్ క్రియేట్ చేస్తారా?
నాకు ఎప్పుడూ పోటీయే
తనకు జగపతిబాబు అంటే ఎప్పుడూ పోటీయే అని చెప్పి నవ్వులు పూయించారు మీనా. 'నాకు మీరు (జగపతిబాబు) ఎప్పుడూ పోటీయే. మీ పక్కన వస్తుంటే నన్ను ఎవరూ చూసే వారు కాదు. మిమ్మల్నే చూసేవారు. కెరీర్‌లో వరుస అవకాశాలు వచ్చినప్పుడే పెళ్లి చేసుకున్నా. పాప పుట్టిన రెండేళ్లకు మలయాళం సినిమా 'దృశ్యం' కోసం నన్ను సంప్రదించారు. పాపను వదిలి వెళ్లలేకు రిజెక్ట్ చేస్తే... స్టోరీ తనను దృష్టిలో పెట్టుకునే రాసినట్లు మేకర్స్ తెలిపారు. దీంతో ఆ మూవీ చేసేందుకు అంగీకరించాను.' అంటూ అప్పటి సంగతులు షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం మీనా 'మూకుత్తి అమ్మన్ 2'లో నటిస్తున్నారు.