Actress Hema: హేమా.. డుమ్మ - బెంగళూరు సీసీబీకి లేఖ, విచారణకు రాలేనని వెల్లడి?

Bangalore Rave Party: బెంగుళూరు రేవ్ పార్టీ కేసు విషయంలో రోజుకు ఒక కొత్త విషయం బయటపడుతోంది. మే 27న 8 మందిని విచారించడానికి సీబీఐ సిద్ధం కాగా తాను విచారణకు రాలేనంటూ ఒక లేఖ రాసింది హేమ.

Continues below advertisement

Actress Hema Letter To CCB: వారం రోజుల క్రితం బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీలో టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన హేమ కూడా నిందితురాలే అని తేలింది. దీంతో మే 27న విచారణకు రమ్మంటూ తనతో పాటు మరో 8 మందికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. అంతే కాకుండా ఈ కేసులో అరెస్ట్ అయినవారిని కూడా విచారించడానికి పోలీసులు సిద్ధమయ్యారు. ఇంతలో ఈ కేసులో నటి హేమ మరో ట్విస్ట్ ఇచ్చింది. తాను విచారణకు రాను అంటూ సీసీబీ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్)కు లేఖ రాసినట్లు తెలిసింది.

Continues below advertisement

రాలేను..

తాను విచారణకు రాలేనంటూ బెంగుళూరు సీసీబీకి హేమ లేఖ రాసినట్లు వార్తలు వస్తున్నాయి. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నానని, అందుకే రాలేకపోతున్నానని తెలిపిందని సమాచారం. అయితే రేవ్ పార్టీ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న సీసీబీ.. హేమ రాసిన లేఖను పరిగణనలోకి తీసుకోలేనట్లు తెలిసింది. ఎలాగైనా విచారణకు హాజరు కావాల్సిందే అని మరోసారి తనకు నోటీసులు పంపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ముందుగా అసలు రేవ్ పార్టీ జరిగిన రోజు తాను బెంగుళూరులోనే లేనని, హైదరాబాద్‌లోని తన ఫార్మ్ హౌజ్‌లో ఉన్నానంటూ వీడియోను విడుదల చేసింది హేమ.

ఆధారాలు ఉన్నాయి..

రేవ్ పార్టీ కేసులో తనను బెంగుళూరు పోలీసులు అనవసరంగా ఇరికించాలని చూస్తున్నారని హేమ ఆరోపిస్తోంది. అంతే కాకుండా బెంగుళూరు పోలీసులపైనే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది కూడా. ముందుగా బెంగుళూరులో రేవ్ పార్టీ జరుగుతున్న సమయంలో హేమ అక్కడే ఉందని చెప్పడానికి బెంగుళూరు పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నట్లు సమాచారం. అయితే, తాను హైదరాబాద్‌లో ఉన్నానంటూ వాదిస్తోంది హేమా.

హేమపైనే ఎక్కువగా ఫోకస్..

బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీకి మరికొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. కానీ వారందరూ చాలావరకు దీనిపై స్పందించడానికి ఇష్టపడలేదు. ముందుగా శ్రీకాంత్, ఆ తర్వాత హేమ.. దీనిపై ముందుగా స్పందించారు. హేమ అయితే ఏకంగా బెంగుళూరులో ఉంటూ హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ వీడియో రికార్డ్ చేయడం చివరికి తనకే చిక్కులు తెచ్చిపెట్టింది. ఒకవేళ తను అలా చేయకుండా సైలెంట్‌గా ఉండుంటే కేసు మామూలుగానే ముందుకు సాగేదేమో అని అనుకుంటున్నారు. తన తప్పు లేదని చెప్పే ప్రతీ ప్రయత్నంలో హేమపై మరింత ఫోకస్ పెరుగుతుందని ఇండస్ట్రీ నిపుణులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ కేసు మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Also Read: అలాంటివి ఇండస్ట్రీలో నార్మల్ అయిపోయాయి, ఇకపై అవే చేస్తా - కాజల్ అగర్వాల్

Continues below advertisement
Sponsored Links by Taboola