Aditi Rao Hydari Old Photo: సినీ అభిమానులకు హీరోయిన్ అదితి రావు హైదరి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ చిత్ర పరిశ్రమలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మలయాళం సినిమాతో 2006లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆమె, ఆ తర్వాత పలు భాషల్లో మూవీస్ చేస్తోంది. తాజాగా అదితి రావు హైదరీ పాత ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తొలి రోజుల్లో ఎలా ఉంది? ఇప్పుడు ఎలా మారిపోయిందో? పోల్చుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఒకప్పుడు బొద్దుగా ఉన్న అదితి.. ఇప్పుడు ఇలా మారడానికి కారణం ప్లాస్టిక్ సర్జరీ అంటున్నారు. స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు తన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని కామెంట్స్ పెడుతున్నారు.  


డబ్బుతో అందాన్ని కొనవచ్చు!


అదితి రావు పాత ఫోటోలను కొత్త ఫోటోలతో కంపేర్ చేస్తూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఆమె ముక్కు చూస్తే సర్జరీ చేయించుకున్నట్లు ఈజీగా తెలిసిపోతుందంటున్నారు. ఎంత తినడం మానేసినా అంత అందంగా తయారు కావడం కష్టం అంటున్నారు. తమకు సంబంధించిన చాలా విషయాల గురించి ఓపెన్ గా చెప్పే హీరోయిన్లు, వారు చేయించుకునే ప్లాస్టిక్ సర్జరీల గురించి ఎందుకు బయటకు చెప్పరో అర్థం కావట్లేదని మరో నెటిజన్ కామెంట్ చేశారు. అదితి తన ముఖంలోని ప్రతి ఫీచర్ ను మార్చుకుందని మరికొంత మంది కామెంట్స్ చేశారు. సర్జరీ తర్వాత ఆమె ముఖం పూర్తిగా మారిపోయిందంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఆమె అప్పటితో పోల్చితే ఇప్పుడు వేరే అమ్మాయిలా కనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.






తాజాగా సిద్ధార్థ్‌తో ఎంగేజ్మెంట్


చాలా కాలంగా హీరో సిద్దార్థ్ తో డేటింగ్ చేస్తున్న అదితి రావు, మార్చిలో ఎంగేజ్మెంట్ చేసుకుంది. తన నిశ్చితార్థం గురించి ఆమె స్పందించింది. తన ఎంగేజ్మెంట్ ప్రత్యేకంగా నిలిచిపోవాలని భావించినట్లు చెప్పింది. అందుకే తన పూర్వీకులు నిర్మించిన 400 ఏళ్ల నాటి పురాతన ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నట్లు వివరించింది. త్వరలోనే పెళ్లి ఎప్పుడు అనే విషయాన్ని చెప్తానని వెల్లడించింది. ‘మహా సముద్రం’ సినిమా సమయంలో సిద్దార్థ్, అదితి రావు ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి వీరిద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నారు. అయితే, రీసెంట్ గా వాళ్లు గుడిలో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆమె మాత్రం కేవలం నిశ్చితార్థం చేసుకున్నట్లు వివరించింది. వీరి పెళ్లి గురించి ఇరు కుటుంబ సభ్యులు ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


అదితి నటించిన ‘హీరామండి’ వెబ్ సీరిస్‌కు విమర్శకులు ప్రశంసలు లభిస్తున్నాయి. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ చిత్రంలో పలువురు స్టార్ హీరోయిన్లతో కలిసి ఆమె నటించింది. ఈ చిత్రంతో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఓ ఇంగ్లీష్ సినిమాలో నటిస్తోంది. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేసింది.


Read Also: మాస్ యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్- ఆకట్టుకుంటున్న ‘హరోం హర‘ ట్రైలర్