Treat Williams Died: సినిమా ఇండస్ట్రీలలో వరుసగా జరుగుతున్న విషాదాలు సినీ లోకాన్ని శోక సంద్రంలో ముంచేస్తున్నాయి. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ సినిమా సెలబ్రెటీలు చాలా మంది కన్నుమూస్తున్నారు. రీసెంట్ హాలీవుడ్ లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు ట్రీట్ విలియమ్స్(71) రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. దీంతో హాలీవుడ్ లో విషాదఛాయలు అలముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారని తెలియడంతో ఆయన అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు.

యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే..

హాలీవుడ్ లో విలక్షణ నటుల్లో ట్రీట్ విలియమ్స్ ఒకరు. ఆయన ఎన్నో టీవీ, సినిమాల్లో నటించి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించినట్టు హాలీవుడ్ మీడియా వెల్లడించింది. విలియమ్స్ కొలరాడో లో బైక్ పై వెళ్తుండగా అదుపుతప్పి ఓ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో విలియమ్స్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయన్ను అత్యవసర హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయనకు వైద్యం అందిస్తుండగానే దురదృష్టవశాత్తు తుదిశ్వాస విడిచినట్టు హాలీవుడ్ మీడియా వెల్లడించింది. ట్రీట్ విలియమ్స్ ఇలా ఆకస్మాత్తుగా చనిపోవడంతో హాలీవుడ్ లో సినిమా ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన మృతి సినీ లోకానికి తీరని లోటనే చెప్పాలి. ట్రీట్ లేరనే వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక విలియమ్స్ ఆకస్మిక మృతి పట్ల హాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు. 

సినీ జీవితం..

ట్రీట్ విలియమ్స్ 1975 నుంచి ఇప్పటి వరకూ సినీ రంగంలో సుధీర్ఘ కాలం పాటు పనిచేశారు. ఆయన ‘డెడ్లీ హీరో’ అనే థ్రిల్లర్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. అక్కడ నుంచి ‘ది రిచ్ అండ్ ది ఈగిల్ హాస్ ల్యాండ్’ సహా ఎన్నో సినిమాల్లో నటించడం ప్రారంభించారు. తర్వాత 1979 లో వచ్చిన ‘హెయిర్’ సినిమాలో ఆయన నటనకు ప్రశంసలు అందుకున్నారు. ఆ సినిమా విలియమ్స్ కు ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 1981 లో వచ్చిన ‘ప్రిన్స్ ఆఫ్ ది సిటీ’ లో తన పాత్రకు గానూ ఉత్తమ నటుడిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. 2002 లో వచ్చి వార్నర్ బ్రదర్స్ ‘ఎవర్ వుడ్’ లో ‘ఆండీ’ పాత్రను గానూ అత్యుత్తమ అవార్డులు ఆయన్ను వరించాయి. ఇలా ఆయన దాదాపు 120 సినిమాల్లో నటించారు. ట్రీట్ విలియమ్స్ చివరి సారి గా నటించిన సినిమా12 మైటీ ఆర్ఫన్స్. 2021 వ సంవత్సరంలో రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక వెబ్ సిరీస్ టీవీ షోల్లో కూడా ఆయన నటింటి ప్రేక్షకుల ను ఆకట్టుకున్నారు. ఇలా ఎన్నో పాత్రల్లో నటించి కోట్లాదిమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు విలియమ్స్. అలాగే విలియమ్స్ కేవలం సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతం గానూ ఎంతో మంచి వ్యక్తి అని ఆయన సహచర నటులు అన్నారు. పని విషయంలో చాలా రిస్క్ లు చేసేవాడని, తోటి నటీనటులతో ఎంతో మంచిగా మెలిగేవాడని విలియమ్స్ తో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : ఏపీలో షూటింగులు - దర్శక నిర్మాతలకు పవన్ కళ్యాణ్ భరోసా!