సీనియర్ కథానాయకుడు, నటుడు నరేష్ విజయకృష్ణ, నటి పవిత్రా లోకేష్ మధ్య  సంబంధం (Pavitra Lokesh Naresh Relationship) ఏమిటో తెలుసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులతో పాటు కన్నడ ప్రజలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. బెంగళూరులో నరేష్, ఆయన మూడో భార్య రమ్య రఘుపతి, పవిత్రా లోకేష్ చేసిన హడావిడి అందరికీ ఇంకా గుర్తే. ఆ తర్వాత న్యూ ఇయర్ సందర్భంగా నరేష్ పోస్ట్ చేసిన లిప్ లాక్ వీడియో అయితే సంచలనం సృష్టించింది. ఈ రోజు ఏకంగా ఆయన పెళ్లి వీడియో పోస్ట్ చేశారు. 


పవిత్రా లోకేష్, నరేష్ పెళ్లి... 
ఎక్కడ చూసినా డిస్కషన్ టాపిక్!
నరేష్ శుక్రవారం ఉదయం సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో పవిత్రా లోకేష్ మెడలో మూడు ముళ్ళు వేశారు. తామిద్దరం ఏడు అడుగులు వేసినట్లు, వివాహ బంధంతో ఒక్కటి అయినట్లు ఆయన పేర్కొన్నారు. ''ఒక పవిత్ర బంధం... రెండు మనసులు... మూడు ముళ్ళు... ఏడు అడుగులు! మీ ఆశీస్సులు కోరుకుంటూ పవిత్రా నరేష్'' అని ట్వీట్ చేశారు. దాంతో నరేష్, పవిత్రా లోకేష్ పెళ్లి చేసుకున్నారని అందరూ భావించారు. ఇప్పుడు అందరూ వీళ్ళ పెళ్లి గురించి డిస్కస్ చేస్తున్నారు.


ఇంటింటి రామాయణం...
వింతైన ప్రేమాయణం!
నరేష్, పవిత్రా లోకేష్ పెళ్లి గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సమయంలో 'ఇంటింటి రామాయణం' ప్రెస్ మీట్ జరిగింది. అందులో హీరోయిన్ నవ్య స్వామి తండ్రి పాత్రలో నరేష్ నటించారు. అందువల్ల, చిత్ర బృందంతో పాటు ఆయన కూడా మీడియా ముందుకు వచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో పెళ్లి వీడియో ప్రస్తావన వచ్చింది. పెళ్లి గురించి పరోక్షంగా ప్రశ్నించగా ''ఇంటింటి రామాయణం... వింతైన ప్రేమాయణం'' అని నరేష్ బదులు ఇచ్చారు. ఆ తర్వాత నేరుగా పెళ్లి గురించి అడగ్గా ''మిగతా వాళ్ళు చెబుతారు'' అని తప్పించుకున్నారు. రాహుల్ రామకృష్ణకు మైక్ అందించారు. ''నేను ఏం చెబుతాను సార్'' అని రాహుల్ రామకృష్ణ తెల్లముఖం వేశారు.
 
త్వరలో ప్రెస్ మీట్ పెడతా - నరేష్
ఇప్పుడు సల్మాన్ ఖాన్, ప్రభాస్ పెళ్లి గురించి తెలుగు ప్రేక్షకులు మర్చిపోయారు. తెలుగు ప్రజలు అందరూ మీ పెళ్లి ఎప్పుడు అని చూస్తున్నారు. ట్విట్టర్ వేదికగా పెళ్లి అయ్యిందని అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ఏంటి? అని ప్రశ్నించగా... ''నేను త్వరలో ప్రెస్ మీట్ పెడతా. నేను ఎప్పుడూ మీడియా ఫ్రెండ్లీనే. రియల్ లైఫ్, రీల్ లైఫ్ ప్రతి వ్యక్తికీ ఉంటుంది. నా జీవితం నేను జీవిస్తా. నేను నమ్మేది అది. ఇప్పుడు ఈ సినిమా విషయాలను డైవర్ట్ చేయాలని అనుకోవడం లేదు'' అని నరేష్ సమాధానం ఇచ్చారు.


Also Read : హనీమూన్‌కు చెక్కేసిన నరేష్, పవిత్రా? అసలు నిజం తెలిస్తే షాకవుతారు!


సినిమా కోసం చేసుకున్న పెళ్లి?
నరేష్ పోస్ట్ చేసిన వీడియోలో పెళ్లి రియల్ లైఫ్ మ్యారేజ్ కాదని, రీల్ లైఫ్ మ్యారేజ్ అని సమాచారం. ప్రముఖ దర్శక, నిర్మాత ఎం.ఎస్. రాజు తెరకెక్కిస్తున్న ఓ సినిమాలో నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటిస్తున్నట్లు సమాచారం. ఆ సినిమా కోసమే చిత్రీకరించిన పెళ్లి సన్నివేశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారని టాక్. తనకు విడాకులు ఇవ్వకుండా నరేష్ పెళ్లి చేసుకున్నారని రమ్య రఘుపతి కోర్టుకు వెళ్లినా సినిమాలో పెళ్లి వీడియో కాబట్టి చెల్లకపోవచ్చు.  


Also Read : తెలుగులోకి కాజల్ అగర్వాల్ 'ఘోస్టీ' - విడుదల ఎప్పుడంటే?