Dev Raturi: దేవ్ రాటూరి.. ప్రస్తుతం ఈ భారతీయుడి పేరు చైనా దేశవ్యాప్తంగా వినబడుతోంది. ఆ దేశంలో ఓ పాఠ్య పుస్తకంలో ఈ వ్యక్తి జీవిత కథను పాఠంగా చేసి విద్యార్థుల్లో స్పూర్తి నింపుతోంది చైనా ప్రభుత్వం. ఇంతకీ అతను ఏం సాధించాడు. భారతదేశానికి చెందిన వ్యక్తి పేరు చైనా పాఠ్య పుస్తకాల్లో చేర్చడమేంటి? ఇండియా వ్యక్తిని చైనీయులు అంత గౌరవంగా చూస్తున్నారు. ఇవన్నీ తెలియాలి అంటే దేవ్ రాటూరి సక్సెస్ స్టోరీ చదవాల్సిందే..


సినిమాల మీద ఆసక్తితో..


దేవ్ రాటూరి ఉత్తరాఖాండ్ లో జన్మించారు. ఆయన స్వగ్రామం తెహ్రీ గడ్వాల్ జిల్లాలోని కెమ్రియా సౌర్. బాల్యం నుంచీ సినిమా హీరో అవ్వాలనే కోరిక ఉండేది. అందుకే సినిమా అవకాశాల కోసం ముంబై వెళ్లాడు. అయితే అక్కడ కొన్ని ఆడిషన్స్ ఇచ్చాడు. కానీ ఎక్కడా సెలెక్ట్ కాలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. తర్వాత చేసేదేమీ లేక తనకు ఇంట్రస్ట్ ఉన్న కరాటే విద్యను నేర్చుకోవాలని అనుకున్నాడు. కొన్నాళ్లు భారత్ లోనే కరాటే నేర్చుకున్నాడు.


కరాటే కోసం చైనాకు..


దేవ్ ఎన్నిసార్లు ప్రయత్నించినా సినిమా అవకాశాలు రాలేదు. భారత్ లో కరాటే శిక్షణ తీసుకున్నాడు. తర్వాత కరాటేలో పూర్తి శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకోస కోసం చైనా వెళ్లాడు. అక్కడ కొద్ది కాలం కారాటే లో ట్రైనింగ్ తీసుకున్నాడు. అయితే కరాటేలో అత్యుత్తమ శిక్షణ పొందాలంటే అక్కడ ఉన్న ప్రముఖ సంస్థ షావోలిన్ టెంపుల్ కి వెళ్లాలని అక్కడి స్థానికులు చెప్పడంతో అతడి ఆశలు అడియాశలయ్యాయి.


హోటల్ లో వెయిటర్ నుంచి ఓనర్ స్థాయికి..


కరాటే నేర్చుకోవాలని కోటి ఆశలతో చైనా వెళ్లిన దేవ్ కు అన్నీ కష్టాలే ఎదురైయ్యాయి. కొన్నాళ్లకు చేతిలో డబ్బులు లేక 2005 లో చైనా లోని ఓ భారతీయ రెస్టారెంట్ లో వెయిటర్ గా పనికి కుదిరాడు. అక్కడ వెయిటర్ గా పనిచేస్తూనే ఆ బిజినెస్ లో టెక్నిక్ లు తెలుసుకున్నాడు. తర్వాత వెయిటర్ నుంచి మేనేజర్ స్థాయికి అక్కడ నుంచి ఓనర్ స్థాయికి ఎదిగాడు. 2013లో జియాన్‌ లో రెడ్ ఫోర్ట్ అనే సొంత రెస్టారెంట్‌ ని ఓపెన్ చేశాడు. భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలను అందులో మేళవించి రెస్టారెంట్ ని ఏర్పాటు చేశాడు.


కస్టమర్ రూపంలో వచ్చిన సినిమా చాన్స్..


దేవ్ ఏర్పాటు చేసిన రెస్టారెంట్ బిజినెస్ బాగా సాగింది. దీంతో సిటీలో పలు  బ్రాంచీలను కూడా ఓపెన్ చేశాడు. 2017 ప్రాంతంలో ఓ రోజు తన హోటల్ కి చైనా సినీ దర్శకుడు భోజనానికి వచ్చాడు. ఆ సమయంలో అతనితో మాట్లాడిన దేవ్ సినిమాల పట్ల తనుకున్న ఆసక్తిని చెప్పాడు. దీంతో ఆ దర్శకుడు దేవ్ కు మొట్టమొదటి సారి సినిమా అవకాశం ఇచ్చాడు. అలా దేవ్ కల ఆ కస్టమర్ ద్వారా నెరవేరింది. 


చైనాలో స్టార్ యాక్టర్ గా గుర్తింపు, పాఠ్యపుస్తకాల్లో దేవ్ సక్సెస్ స్టోరీ..


ఓ చైనా దర్శకుడి ద్వారా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు దేవ్. అంతే అక్కడి నుంచి అతనికి వరుస అవకాశాలు వచ్చాయి. ఇక అప్పటి నుంచి దేవ్ 35 కు పైగా సినిమాల్లో నటించారు. చాలా టీవీ షోలు, టీవీ సీరియల్స్ లో నటించాడు. ఇందులో అతను ప్రముఖ పాత్ర పోషించిన 'మై రూమ్‌మేట్ ఈజ్ ఎ డిటెక్టివ్' వంటివి దేవ్ కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. దాంతో దేవ్ రెస్టారెంట్ బిజినెస్ కూడా విస్తరించింది. ఈరోజు చైనాలో ఎనిమిది రెస్టారెంట్లకు యజమాని అయ్యాడు దేవ్. ఇలా సినిమాల్లో హీరోగా నటించాలనే తన కలను ఆయన 46 ఏళ్ల వయసులో సాధించాడు. ఆయన సక్సెస్ స్టోరీను ఇప్పుడు చైనా ప్రభుత్వం తమ పాఠ్యపుస్తకాల్లో చేర్చి విద్యార్థుల్లో స్పూర్తి నింపుతున్నారు. నిజంగా ఓ భారతీయుడి సక్సెస్ స్టోరీ చైనా ప్రభుత్వం పాఠాలుగా చెప్తుంది అంటే భారతీయులకు గర్వకారణమనే చెప్పాలి. 


Also Read: ‘బిగ్ బాస్’ అభిమానులకు షాకింగ్ న్యూస్ - నాగార్జునకు నోటీసులిచ్చిన కోర్టు, ఎందుకంటే?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial