అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప: ది రైజ్’ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు సీక్వెల్‌తో రాబోతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. డైరెక్టర్ సుకుమార్ చేసే సినిమాలన్నింటిలోనూ ఐటెం సాంగ్స్ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్ ను తీసుకువస్తాయి. అదే 'పుష్ప' విషయంలో కూడా జరిగింది. పార్ట్ 1 లో 'ఊ అంటావా మామా..' అనే ఐటెం సాంగ్ లో స్టార్ హీరోయిన్ చేసి పాన్ ఇండియా రేంజ్ లో ఫేమ్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు రాబోయే 'పుష్ప' సీక్వెల్‌లో ఏ హీరోయిన్‌ స్పెషల్‌ సాంగ్‌ చేస్తుందో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


ఈ క్రమంలోనే ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. 'పుష్ప 2'లో ఐటెం సాంగ్ కోసం ఓ ట్రెండింగ్ హీరోయిన్ ను మేకర్స్ సంప్రదించారని, కానీ ఆమె చేసేందుకు నిరాకరించినట్టు సమాచారం. ఇంతకీ ఆ ట్రెండింగ్ హీరోయిన్ ఎవరన్న విషయానికొస్తే.. 'ధమాకా' సినిమాతో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న శ్రీలీల. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీయెస్ట్ హీరోయిన్ గా మారిన ఆమెను.. పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేయమని మేకర్స్ సంప్రదించినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. షాకింగ్ అంశం ఏమిటంటే, ఆమె సినిమాలో భాగం చేయడాన్ని తిరస్కరించిందట. సోలో హీరోయిన్‌గా ఆమె చేతిలో ఇప్పటికే బోలెడన్ని సినిమాలు ఉండడంతో శ్రీలీల ఈ స్పెషల్ సాంగ్ చేయాలనుకోలేదనేది గాసిప్ వినిపిస్తోంది. పైగా, హీరోయిన్‌గా ఎదుగుతున్నసమయంలో ఐటెమ్ సాంగ్స్ చేస్తే.. కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందనే ఆలోచనలో ఉద్దేశంతో సున్నితంగా అవకాశాన్ని తిరస్కరించిందని తెలిసింది.


ప్రస్తుతమున్న హీరోయిన్లలో శ్రీలీల ది బెస్ట్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకుంటోంది. ఆమె చేతిలో దాదాపు ఏడు సినిమాలు ఉన్నట్టు సమాచారం. కాబట్టి, ఈ పరిస్థితిలో ఆమె భారీ రెమ్యునరేషన్ కూడా డిమాండ్ అవకాశం ఉంది. కానీ అల్లు అర్జున్ చిత్రానికి నో చెప్పడం అందర్నీ షాక్ కు గురిచేస్తోంది. మాములుగా అయితే బన్నీతో చేసేందుకు చాలా మంది ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. కానీ శ్రీలీల మాత్రం ఆ ఛాన్స్ ను మిస్ చేసుకున్నట్టు సమాచారం. అయితే మరి పుష్ప 2లో అల్లు అర్జున్‌తో కాలు కదిపే లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో కాలమే చెప్పాలి. అయితే, శ్రీలీలా ఇప్పటికే ‘ఆహా’ ప్రకటనలో బన్నీతో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ క్రేజ్‌ను వాడుకోవాలనే ఉద్దేశంతోనే మూవీ యూనిట్ ఆమెను సంప్రదించినట్లు సమాచారం.


అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2023లోనే ఈ సినిమా విడుదలవుతుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 'పుష్ప 2' సినిమా విడుదల గురించి ఇప్పటివరకైతే చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు . దర్శకుడు సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమా తీస్తున్నందున సహజంగానే ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి 2024లో 'పుష్ప 2' సినిమా విడుదల కానుందని వినిపిస్తోంది. 


Read Also : Ustaad Trailer: మెషిన్స్‌ను నమ్ము, అవి నిన్ను ఎప్పుడూ మోసం చేయవు - ఆసక్తికరంగా శ్రీసింహ ‘ఉస్తాద్’ ట్రైలర్!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial