Acharya Movie First Day Collections in Telugu states: మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా 'ఆచార్య'. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ సినిమా విడుదల అయ్యింది. అయితే, సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. అభిమానుల అంచనాలను అందుకోవడం సినిమాలో సినిమా ఫెయిల్ అయింది. నెగెటివ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వసూళ్ల దగ్గర ఆ ప్రభావం కనిపించింది.


తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తొలి రోజు 'ఆచార్య'కు 33 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. దీని కంటే ముందు రామ్ చరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్'కు రూ. 73 కోట్లు వచ్చాయి. దాంతో పోలిస్తే... 'ఆచార్య'కు సగం కూడా రాలేదు. 'కెజియఫ్ 2'తో పోలిస్తే... ఎక్కువ అని చెప్పాలి. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'కెజియఫ్ 2' తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు సుమారు 20 కోట్ల రూపాయలు మాత్రమే కలెక్ట్ చేసింది.






Also Read: 'ఆచార్య' రివ్యూ: చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఈ సినిమా ఎలా ఉందంటే?


చిరంజీవి (Chiranjeevi), రామ్ చరణ్ (Ram Charan) నటించడంతో మెగా అభిమానులు థియేటర్లకు వెళ్లారు. 'ఆర్ఆర్ఆర్'కు రాజమౌళి దర్శకత్వం కూడా తోడు కావడం, అందులో ఎన్టీఆర్ కూడా ఉండటంతో అందరి అభిమానులు సినిమా చూశారు. మూవీకి హిట్ టాక్ రావడం ప్లస్ అయ్యింది. నెగెటివ్, మిక్స్డ్ టాక్ నేపథ్యంలో శని, ఆది వారాలు 'ఆచార్య' చూడటానికి ప్రేక్షకులు ఏమాత్రం వస్తారనేది చూడాలి.


Also Read: 'ఆచార్య'తో కొరటాల శివకు 25 కోట్లు లాస్? వచ్చేది పోయె, వస్తుందని అనుకున్నదీ పోయె!