Mahesh Babu: మహేష్ బాబు కోర్టులో SSMB 28 బాల్

ఇప్పుడు మహేష్ బాబు కోర్టులో SSMB 28 బాల్ ఉంది. ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయాలనే నిర్ణయం ఆయన చేతుల్లో ఉంది. 

Continues below advertisement

సూపర్ స్టార్ట్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన 'సర్కారు వారి పాట' (Sarkaru Vaari Paata) మే 12న విడుదల కానుంది. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు టాపిక్ దాని గురించి కాదు... 'సర్కారు వారి పాట' తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్  (Trivikram Srinivas) దర్శకత్వంలో చేయనున్న సినిమా (SSMB 28) షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దాని గురించి! ఆ నిర్ణయం మహేష్ చేతుల్లో ఉంది.

Continues below advertisement

ప్రస్తుతం మహేష్ బాబు స్పెయిన్ హాలిడే టూర్‌లో ఉన్నారు. ఇది స్వీట్ అండ్ షార్ట్ ట్రిప్. ఆయన ఇండియాకు వచ్చిన తర్వాత 'సర్కారు వారి పాట' ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు. సాధారణంగా సినిమా సినిమాకు మధ్య కొంత విరామం తీసుకోవడం మహేష్ బాబుకు అలవాటు. అయితే, ఆయన ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటారా? లేదా? అనేది చూడాలి. ఎందుకంటే... 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ కంప్లీట్ చేసి చాలా రోజులు అయ్యింది. మహేష్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ బౌండ్ స్క్రిప్ట్ కంప్లీట్ చేశారు. రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేద్దామని మహేష్ బాబు చెబుతారోనని  వెయిటింగ్.

Also Read: 'ఆచార్య'తో కొరటాల శివకు 25 కోట్లు లాస్? వచ్చేది పోయె, వస్తుందని అనుకున్నదీ పోయె!

త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయాలి. 'ఆర్ఆర్ఆర్' విడుదల తర్వాత మహేష్ సినిమా స్క్రిప్ట్ మీద వర్క్ చేయడం రాజమౌళి స్టార్ట్ చేశారు. 'ఆర్ఆర్ఆర్' విడుదలకు ముందు కొవిడ్ వల్ల వచ్చిన విరామంలో కొన్ని ఐడియాస్ కూడా అనుకున్నారు. మహేష్ బాబు స్పెయిన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత స్క్రిప్ట్ డిస్కషన్స్ స్టార్ట్ చేసి... ఇయర్ ఎండ్‌లో షూటింగ్ స్టార్ట్ చేయాలనేది రాజమౌళి ప్లాన్. అలా చేయాలంటే... త్రివిక్రమ్ సినిమాను నాలుగైదు నెలల్లో ఫినిష్ చేయాలి. అందువల్ల, మహేష్ బాబు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. బాల్ ఆయన కోర్టులో ఉంది.

Also Read: 'ఆచార్య' రివ్యూ: చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఈ సినిమా ఎలా ఉందంటే?

Continues below advertisement
Sponsored Links by Taboola