టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే 'ఖుషి' షూటింగ్ పూర్తి చేసిన సమంత.. తాను కొన్ని నెలలపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన ఆరోగ్యం పై దృష్టి సారించబోతున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం వెకేషన్ ట్రిప్ ని ఫ్రెండ్స్ తో కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తోంది. ఇండస్ట్రీలో సమంత బెస్ట్ ఫ్రెండ్స్ లో సింగర్ చిన్మయి కూడా ఒకరు. వీళ్లిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఈనాటిది కాదు. సమంత నటించిన 'ఏ మాయ చేసావే' సినిమాలో సమంత పాత్రకి చిన్మయి డబ్బింగ్ చెప్పింది. తర్వాత చాలా సినిమాల్లోనూ సమంతకు చిన్మయి డబ్బింగ్ చెప్పగా.. ఆ వాయిస్ తోనే సమంతకు మంచి గుర్తింపు వచ్చింది. అలా వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా మారారు.


ఇక ఈ ఇద్దరు కేవలం ప్రొఫెషనల్ గానే కాదు.. పర్సనల్ గా కూడా బెస్ట్ ఫ్రెండ్స్. చిన్మయి, హీరో రాహుల్ రవీంద్రన్, కమెడియన్ వెన్నెల కిషోర్ ఇలా అందరూ కలిసి అప్పుడప్పుడు చిల్ అవుతూ ఉంటారు. వీళ్లంతా ఓ గ్యాంగ్ గా సందడి చేస్తూ ఉంటారు. కానీ గత కొన్ని నెలలుగా సమంత ఎవరితోనూ కలవడం లేదు. రీసెంట్ గా తన కొత్త ఫ్రెండ్ తో బాలిలో వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేసి వచ్చింది సమంత. ఇక తన బెస్ట్ ఫ్రెండ్ చిన్మయి తో కనిపించక చాలా నెలలే అవుతుంది. అయితే అప్పుడప్పుడు మాత్రం సోషల్ మీడియాలో పోస్టులు చేసేది. అలాగే సమంత మీద ఏదైనా ట్రోలింగ్ జరిగితే చిన్మయి వెంటనే రియాక్ట్ అయ్యేది. అయితే చాలా రోజుల తర్వాత తాజాగా సమంత చిన్మయి ఇంట్లో సందడి చేసింది. చిన్మయి కవల పిల్లలతో సమంత ఆడుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


చిన్మయి కవల పిల్లలతో సరదాగా ఆడుతున్న సమంత వాళ్ళతో ఓ పోటీలో ఓడిపోతున్నట్టు కూడా ఈ వీడియోలో కనిపిస్తోంది. ఇక ఈ వీడియోను రాహుల్ రవీంద్రన్ ని తీసినట్టు తెలుస్తోంది. ఈ వీడియోని సమంత తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేయగా.. ఈ వీడియో కాస్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోకి నెటిజన్స్, ఫ్యాన్స్ లైక్ ల వర్షం కురిపిస్తున్నారు. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. విజయ్ దేవరకొండ సరసన 'ఖుషి' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. నిన్ను కోరి మూవీ ఫేమ్ శివ నిర్వాణ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. రీసెంట్ గానే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.


రొమాంటిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నా రోజా నువ్వే, ఆరాధ్య అనే పాటలు యూట్యూబ్ లో భారీ వ్యూస్ ని అందుకొని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాయి. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 1వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. 'మహానటి' సినిమాలో గెస్ట్ పెయిర్ గా ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ, సమంత ఈసారి ఫుల్ లెన్త్ రోల్స్ లో నటించడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా సమంతకి ఎలాంటి సక్సెస్ ని అందిస్తుందో చూడాలి.


Also Read : కీర్తి సురేష్ తల్లితో ఓ మూవీ చేశా - ఆ విషయంలో ఎవరినైనా నిలదీసి అడుగుతా: చిరంజీవి




Join Us on Telegram: https://t.me/abpdesamofficial