కొంతమంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్లు అయినా.. ఆడియన్స్‌లో వారి క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. అలాంటి హీరోల్లో రజినీకాంత్ పేరు కచ్చితంగా ఉంటుంది. ఇప్పటికీ ఆయన సినిమా అంటే ఒక పండగా లాగా సెలబ్రేట్ చేస్తారు అభిమానులు. తమిళనాడులో అయితే రజినీ సినిమా విడుదల అవుతుందంటూ చాలు.. సెలవులు ప్రకటించిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే ట్రెండ్ నడుస్తోంది. ఆయన చేసిన మూవీ హిట్ అయినా, ఫ్లాప్ అయినా అభిమానులు మాత్రం రిజల్ట్‌ను ఎప్పుడూ పాజిటివ్‌గానే తీసుకుంటున్నారు. ఇక త్వరలోనే ‘జైలర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న రజినీ.. ప్రీ బుకింగ్స్ విషయంలో రికార్డులు సృష్టించారు. అది కూడా ఇండియాలో కాదు.. అమెరికాలో.
ఆ రెండు చిత్రాలను దాటి..
రజినీకాంత్ సినిమా అంటే దానికి తగిన ప్రమోషన్స్ ఉన్నా.. లేకపోయినా.. కచ్చితంగా హైప్ మాత్రం ఉంటుంది. ప్రస్తుతం ‘జైలర్’కు కూడా అంతే. అందుకే ఇప్పటికే ‘జైలర్’ పలు రికార్డులను బద్దులకొడుతోంది. ఒక ఎంటర్‌టైన్మెంట్ పోర్టల్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. అమెరికాలో ఈ మూవీ ప్రీ బుకింగ్ సేల్స్ ఒక రేంజ్‌లో ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ 500,000 డాలర్ల ప్రీ బుకింగ్ జరిగిందని ఆ పోర్టల్ తెలిపింది. అమెరికాలో ఇప్పటికే పలు ఇండియన్ సినిమాలు బుకింగ్ విషయంలో రికార్డులు సృష్టించాయి. అందులో కొన్ని తమిళ చిత్రాలు కూడా ఉన్నాయి. ‘పొన్నియిన్ సెల్వన్ 2’, ‘వారిసు’ లాంటి తమిళ సినిమాలు అమెరికాలో ప్రీ బుకింగ్ విషయంలో కొన్ని రికార్డులు క్రియేట్ చేయగా.. ‘జైలర్’ వాటన్నింటిని దాటుకుంటూ మొదటి స్థానంలో నిలిచింది.
ఇండియాలో మాత్రమే కాదు.. అమెరికా, జపాన్ లాంటి ఇతర దేశాల్లో కూడా తలైవా తన సత్తాను చాటుకున్నాడు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇప్పటికే రజినీ పేరు మీద పలు రికార్డులు కూడా ఉన్నాయి. మూడు రోజుల ముందు యూఎస్‌లో ‘జైలర్’ ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి. మొదటిరోజే 180,000 డాలర్ల ప్రీ బుకింగ్స్ జరిగాయి. ఇక కొద్ది సమయంలోనే ఏకంగా 50 మిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంది ‘జైలర్’. 2023లోనే విడుదలయిన తమిళ చిత్రాలు.. ‘పొన్నియిన్ సెల్వన్’, ‘వారిసు’.. ఈ ఏడాదిలో అమెరికాలో ఎక్కువ ప్రీ బుకింగ్స్ సాధించిన సినిమాలలో మొదటి స్థానంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ స్థానంలోకి ‘జైలర్’ వచ్చింది.
ఇండియాలో ప్రీ బుకింగ్ పరిస్థితి ఇదీ..
అమెరికాను పక్కన పెడితే.. ఇండియా విషయానికొస్తే.. ‘జైలర్’ ప్రీ బుకింగ్ గ్రాస్ యావరేజ్ రూ.1.7 కోట్లుగా ఉంది. కేవలం తెలుగులో మాత్రమే ‘జైలర్’ డబ్బింగ్ యావరేజ్ రూ.16.14 లక్షలుగా ఉంది. ఇక మొత్తంగా ‘జైలర్’ బుకింగ్స్ విషయానికొస్తే.. రూ.1.9 కోట్ల మార్క్‌ను టచ్ చేసింది. ప్రస్తుతం ‘జైలర్’ ఒరిజినల్ వెర్షన్‌కు 58,390 టికెట్స్ అమ్ముడుపోగా.. దాని తెలుగు డబ్బింగ్‌కు 8,514 టికెట్లు అమ్ముడుపోయాయి. మొత్తంగా ‘జైలర్’ కోసం ముందుగానే 66,904 టికెట్లు ప్రీ బుకింగ్ అయ్యాయి. రెండేళ్ల తర్వాత రజినీని స్క్రీన్‌పై చూస్తున్నామనే అభిమానులు ఉత్సాహం అంతా ఇంతా కాదు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘జైలర్’లో రజినీ సరసన తమన్నా హీరోయిన్‌గా నటించింది. ఆగస్ట్ 10న విడుదల కానున్న ఈ చిత్రం కేవలం తమిళనాడులోనే రూ.50 నుండి 60 కోట్ల వరకు ఫస్ట్ డే కలెక్షన్స్ సాధిస్తుందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు.
Also Read: వర్మ, గరికపాటి నుంచి అంబటి వరకు ఎవ్వరినీ వదలని 'హైపర్' ఆది - మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial