మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రూపొందుతోంది. మిల్కీబ్యూటీ తమన్నా, ‘మహానటి’ బ్యూటీ కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘వేదాళం’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ అయ్యింది. తాజాగా’ భోళా శంకర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో పాల్గొన్న నిర్మాత అల్లు అరవింద్ జీవితా రాజశేఖర్ దంపతులకు కౌంటర్ వచ్చారు.

      


12 ఏళ్లు పోరాడి జైలుకు పంపించా- అల్లు అరవింద్


‘భోళా శంకర్’ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని నిర్మాత అల్లు అరవింద్ ఆకాంక్షించారు. “చిరంజీవి గారు చూడనికి సక్సెస్ లేదు. మీరంతా చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగితే, నేను ఆయనతో సినిమాలు చేస్తూ పెరిగాను. చిరంజీవి అంటే ఎంత అభిమానమో చెప్పుకోవాల్సిన పనిలేదు. 12 ఏళ్ల క్రితం చిరంజీవి సామాజిక సేవలపై ఒకరు నీచంగా మాట్లాడితే, 12 ఏళ్ళు పోరాడి జైలుకి వెళ్ళే వరకూ ఊరుకోలేదు. మెహర్ రమేష్ ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అనిల్ నాకు మంచి స్నేహితుడు. ఇంత మంచి వాళ్ళు కలసి తీసుస్తున్న సినిమాని కచ్చితంగా హిట్ కావాలి అని కోరుకుంటున్నాను” అన్నారు.   


దర్శకుడిగా నాకు ఇది పునర్జన్మ-మెహర్ రమేష్


దర్శకుడు మెహర్ రమేష్ ‘భోళాశంకర్’ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి గురించి ఎన్నో విషయాలు వెల్లడించారు. “చిరంజీవి అన్నయ్యతో సినిమా చేయడం  నా అదృష్టం. షాడోలో వున్న నాపై మెగాస్టార్ వెలుగు పడింది. దర్శకుడిగా నాకు ఇది పునర్జన్మ. ‘సరిలేరు నీకెవ్వరు’ సమయంలో చిరంజీవిగారితో సినిమా చేయాలని అనిల్ గారు కోరారు. ‘భోళా శంకర్’ సినిమా చేయడం అనేది అన్నయ్య నాకు ఇచ్చిన గొప్ప అవకాశం. కలని నిజం చేసిన అనిల్ గారికి థాంక్ యూ. మేము అనుకున్నది వచ్చింది. టీం అందరి సపోర్ట్ తో భోళా శంకర్ ని ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం” అని తెలిపారు. 


ఈ సినిమాతో నా కల నెరవేరింది- అనిల్ సుంకర


చిరంజీవి గారితో సినిమా చేయాలనే తన కల నెరవేరిందని నిర్మాత అనిల్ సుంకర తెలిపారు. ‘భోళా శంకర్’ సినిమాతో చిరంజవితో సినిమా చేయాలనే కోరిక తీరింది. ఇది నాకు లైఫ్ టైం ఎచీవ్‌మెంట్. మెహర్ రమేష్‌కు థాంక్స్. ఈ సినిమా జర్నీలో చిరంజీవి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. చిరంజీవిని నటుడు డ్యాన్సర్ ఫైటర్ తో పాటు ఆయనలోని మానవతవాదిగా చూశాను. నేను కలసిన అద్భుతమైన వ్యక్తి చిరంజీవి. ఆయనతో మళ్ళీ మళ్ళీ సినిమాలు చేయాలని వుంది. సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు” అని ప్పారు.


'భోళా శంకర్‌' ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగా ప్రొడ్యుసర్ అల్లు అరవింద్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్,ఏఎం రత్నం, దర్శకులు గోపీచంద్ మలినేని, బాబీ, వంశీ పైడిపల్లి, సంపత్ నంది, బుచ్చిబాబు సాన తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. 


Read Also: వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పెళ్లి చేసుకున్న ఆలియా భట్ - ఎలాగంటే?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial