అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'తండేల్' త్వరలోనే తెరపైకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. అయితే ప్రతి భాషలోనూ సినిమాకు సంబంధించి సపరేట్ గా ప్రమోషన్లు చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే ఇప్పటికే చెన్నైలో కార్తీ స్పెషల్ గెస్ట్ గా తమిళ ట్రైలర్ ని ప్రత్యేకంగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం రోజు ఈ సినిమా హిందీ ట్రైలర్ ని మరో స్పెషల్ ఈవెంట్లో రిలీజ్ చేశారు. ముంబైలో జరిగిన 'తండేల్' హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఆయన దేవిశ్రీ మ్యూజిక్ ని స్పెషల్ గా పొగిడారు. అంతే కాకుండా దేవి శ్రీ పాటల్లో తన ఫేవరెట్ సాంగ్ ఏంటో వెల్లడించారు.


రాక్ స్టార్ మ్యూజిక్ పై అమీర్ ఖాన్ కామెంట్స్ 
నిన్న జరిగిన 'తండేల్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర బృందంతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. ఇక ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన అమీర్ ఖాన్ సినిమా గురించి మాట్లాడుతూ దేవి శ్రీ ప్రసాద్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అమీర్ ఖాన్ మాట్లాడుతూ "'తండేల్' మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ట్రైలర్ అద్భుతంగా ఉంది, నాకు నచ్చింది. దర్శకుడు ఈ మూవీని అద్భుతంగా తీశారు. అలాగే మ్యూజిక్ కూడా ఫెంటాస్టిక్ గా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ చేసిన 'డింక చిక డింక చిక' సాంగ్ నా ఫేవరెట్ సాంగ్. నిజానికి నాకు డాన్స్ చేయడం పెద్దగా ఇష్టం ఉండదు. కానీ ఆ పాట విన్నాక డాన్స్ చేయడం మొదలు పెట్టాను" అంటూ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి అమీర్ ఖాన్ మాట్లాడడం హైలైట్ గా నిలిచింది. 


దేవి శ్రీ ప్రసాద్ రియాక్షన్...
ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ "తండేల్ మూవీకి అమీర్ ఖాన్ సపోర్ట్ చేయడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఆయనను కలవడం గర్వంగా కూడా ఉంది. ఇండియన్ సినిమాకి ఆయన కాంట్రిబ్యూషన్ ఎంతగానో ఉంది. నిజానికి ముంబై ఆడియన్స్ నా పాటలకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. వి లవ్ యు అమీర్ సార్" అంటూ సమాధానం చెప్పారు. అలాగే సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 


Also Read: ఉపేంద్ర 'యూఐ' నుంచి సుదీప్ 'మ్యాక్స్' వరకూ... ఫిబ్రవరిలో ఓటీటీలోకి రాబోతున్న కన్నడ సినిమాల లిస్ట్‌ ఇదిగో


యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న హైలీ యాంటీసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ 'తండేల్'. చందు మొండేటి దర్శకత్వంలో, అల్లు అరవింద్ సమర్పణలో, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీ ప్రమోషన్లకు సంబంధించి ఒక్కో భాషలో ఒక్కో హీరో సపోర్టుగా నిలవడంతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది.


Read Also: రాచరికం రివ్యూ: సీఎం సీటుకు అక్క, తమ్ముడు చేసిన రక్తచరిత్ర - రాయలసీమ రాజకీయాలకు అద్దం పట్టేలా...