7G Brindavan colony: ‘7/G బృందావన కాలనీ’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. 2005లో దర్శకుడు సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మూవీలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించారు. ఈ మూవీ అప్పట్లో లవ్ స్టోరీ సినిమాలకు ఒక ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పాలి. ఈ సినిమా ఇప్పటికీ చాలా మందికి ఫేవరేట్ మూవీ లిస్ట్ లలో ఒకటిగా ఉంటుంది. అంతలా మూవీ ప్రేక్షకులపై ప్రభావం చూపింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉందంటూ గత కొన్నేళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీను ఎంతగానో అభిమానించే ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ మూవీ సీక్వెల్ కు సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక దాదాపుగా పూర్తయినట్లు సమాచారం.


19 ఏళ్ల తర్వాత మళ్లీ అదే హీరోతో సీక్వెల్..


‘7/G బృందావన కాలనీ’ సినిమా సీక్వెల్ వస్తుందని ఎప్పుటి నుంచో వస్తోన్న వార్తలకు త్వరలో చెక్ పడనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ వచ్చి దాదాపు 19 ఏళ్లు గడిచిపోయింది. అప్పట్లో ఈ సినిమాలో హీరోగా నటించిన రవికృష్ణ నటనకు ప్రశంసలు దక్కాయి. అయితే ఈ సినిమా తర్వాత ఆయన పలు సినిమాల్లో నటించినా ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. కానీ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తెరకెక్కబోతున్న ఆ హిట్ లవ్ స్టోరీ సీక్వెల్ లో మళ్లీ రవికృష్ణే హీరోగా కనిపిస్తారని టాక్. ఎందుకంటే... ‘7/G బృందావన కాలనీ’ మూవీ పేరు చెప్పగానే ముందు అందరి మదిలో రవికృష్ణ అమాయకపు ముఖమే గుర్తుకు మన కళ్ల ముందు కనిపిస్తుంది. అంతలా ఆయన ఆ పాత్రలో ఒదిగిపోయాడు. అందుకే ఇప్పుడు సీక్వెల్ లో కూడా ఆయన్ని హీరోగా పెడితేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని అనుకుంటోందట మూవీ టీమ్. అయితే మధ్యలో విజయ్ దేవరకొండ, కార్తీ, ధనుష్ లాంటి హీరోల పేర్లు వినిపించినా ఫైనల్ గా మేకర్స్ రవికృష్ణకే ఓటేసినట్టు తెలుస్తోంది.  


సీక్వెల్ లో హీరోయిన్ కోసం సెర్చింగ్..


‘7/G బృందావన కాలనీ’ సినిమాలో హీరోయిన్ గా సోనియా అగర్వాల్ నటించింది. అయితే ఇప్పుడు సీక్వెల్ కు సోనియా బదులు వేరే హీరోయిన్ ను వెతుకుతున్నారట మేకర్స్. ఈ మధ్య ‘లవ్ టుడే’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇవానాతో మూవీటీమ్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అలాగే అదితి శంకర్ తో కూడా చర్చలు జరుపుతున్నారట మేకర్స్. మరి ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేస్తారు అనేది తెలియాల్సి ఉంది. 


యువన్ శంకర్ రాజా సంగీతంలోనే..


‘7/G బృందావన కాలనీ’ సినిమా పాటలకు అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేదో పెద్దగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ లవ్ సాంగ్స్ అంటే ఆ సినిమాలో పాటలే ఎక్కువగా గుర్తొస్తాయి. అలాంటి చక్కటి ఆల్బమ్ ను ఆ సినిమాకు అందించారు సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా. అందుకే ఇప్పుడు తెరకెక్కబోయే సీక్వెల్ సినిమాకు కూడా ఆయనే సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ మూవీ సీక్వెల్ మొదటి పార్ట్ లాంటి సూపర్ సక్సెస్ ను అందుకుంటుందో లేదో చూడాలి. 


Also Read: సమంత కళ్లజోడు ఎత్తుకెళ్లిన కోతి - తర్వాత ఏం జరిగిందంటే?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial